29.7 C
Hyderabad
May 3, 2024 06: 39 AM
Slider విశాఖపట్నం

రిలాక్స్: రేపటి నుంచి చాలా ప్రాంతాలలో వెసులుబాటు

vijayasai 191

పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం స్థానిక వుడా చిల్డ్రన్ ఎరీనా లో రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస రావు లతో కలసి మంత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి ని పారద్రోలడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయన్నారు. విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం కొత్తగా మరొక కేసు నమోదయిందని తెలిపారు.

దీనితో మొత్తం 21 కరోనా  పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదు కాగా 16 మంది డిశ్చార్జి అయ్యారని, మిగిలిన ఐదు మంది చికిత్స పొందుతున్నారన్నారు. మార్చి 19న జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయిందని, 25 30 మందికి టెస్టులను నిర్వహించగా 21 53 మందికి నెగిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

మిగిలిన వారిని అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు. కంటైన్ మెంట్  జోన్లను మినహాయించి, మిగిలిన జోన్ లలో ఏప్రిల్ 20వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు తో మార్గదర్శకాలను జారీ చేశారనీ , సంబంధిత ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ పేపర్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేస్తారన్నారు.

జీవీఎంసీ పరిధిలో గల 98 వార్డులు, నర్శిపట్నం  మున్సిపాలిటీ పరిధిలో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో 973 మంది క్వారం టైన్ కేంద్రంలో ఉండి 303 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. వీరందరికీ అన్ని రకాల వసతులతో ఆహార ఏర్పాట్లను అందిస్తున్నామన్నారు.

వసతి లేనివారు, వలస కూలీలు సుమారు 56 వేల మంది ఉన్నారని జి వి ఎం సీ 26 షెల్టర్ల ను నిర్వహిస్తు వారికి ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు , దాతలు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారన్నారు.

జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న 5 వేల మంది శానిటేషన్ వర్కర్లకు 58 వేల మాస్క్లను పంపిణీ చేశారన్నారు. డాక్టర్లు, పోలీసు, రెవెన్యూ, శానిటేషన్ ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది 21వేల మంది వరకూ 24/7 పనిచేస్తున్నారని వీరందరికీ రక్షణ నిమిత్తం మాస్క్ లను, కిట్స్ ఇచ్చామన్నారు.

కరోనా కట్టడికి అహర్నిశలు పనిచేస్తున్న వైద్య, పోలీస్ , శానిటేషన్ సిబ్బందికి అందిస్తున్న  ఇన్సూరెన్స్ సౌకర్యం, మీడియా జర్నలిస్టులకు కూడా ఇన్సూరెన్స్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతామన్నారు.

రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా కి వ్యతిరేకంగా పోరాటం  చేస్తున్నదని, భారత జాతి మనుగడ ను నిలబెట్టే ధ్యేయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తున్నయన్నారు.

సచివాలయ సిబ్బంది , గ్రామ, వార్డు వాలంటీర్లు , ఆశా, ఏఎన్ఎం వర్కర్లు కరోనా వ్యాధి సూచనలు కనబడిన ప్రాంతాలలో  ఇంటింటికి సర్వే చేసి వ్యాధి అనుమానితులను క్వారంటయిన్ సెంటర్ కి పంపుతున్నారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు తగదని మానవ జాతి మనుగడకు పార్టీలకతీతంగా కరోనా పై పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.

కరోనా వైద్య పరీక్షల నిమిత్తం రాష్ట్రానికి లక్ష టెస్ట్ కిట్స్ వచ్చాయనీ ,విశాఖ జిల్లాకు ఐదువేల కిట్స్ కేటాయించారనీ నేటి సాయంత్రానికి అవి రానున్నాయన్నారు. అంతకు ముందు  మంత్రి, కలెక్టరు వి. వినయ్ చంద్, నగర పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జి వి ఎం సి కమిషనరు డా. జి.సృజన, తదితర అధికారులతో విఎంఆర్డిఎ చిల్ట్రన్స్ ఎరీనాలో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా  జిల్లాలో కోవిడ్–19 వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, శానిటైజర్ల, మాస్కుల లభ్యత, తదితర విషయాలపై చర్చించారు.  జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ జిల్లాలో కోవిడ్ – 19 కేసులు  5 ఉన్నాయని, 16 మంది కోలుకుని డిశ్చార్జ్ గావించబడ్డారని వివరించారు.

డాక్టర్లకు, ఇతర సిబ్బంది, జి.వి.ఎం.సి పారిశుద్య  సిబ్బందికి, ఏ ఒక్కరికి మాస్కుల కొరత లేదని వివరించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, విఎంఆర్డిఎ అదనపు కమీషనర్ మనజీర్ జిలానీ సమూన్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, విమ్స్ సంచాలకులు డా. కడలి సత్య వర ప్రసాద్, డిఎంహెచ్ఓ డా. ఎస్. తిరుపతిరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పని లేని వాళ్లవల్ల పెరుగుతున్న కరోనా

Satyam NEWS

తల్లి బిడ్డ సంక్షేమమే ధ్యేయం

Murali Krishna

నకిలీ నేవీ అధికారి అరెస్ట్

Bhavani

Leave a Comment