40.2 C
Hyderabad
April 29, 2024 15: 30 PM
Slider

ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకే

#parliamentary constituency

ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు టిక్కెట్లు బీసీలకు ఇవ్వాలని ప్రపోజల్స్​రాగా, రెండు ప్రకటిస్తామని టీపీసీసీ తీర్మానించిందని మల్లు రవి పేర్కొన్నారు. బీసీలకు అధిక టిక్కెట్లు ఇవ్వడం వలన పార్టీకి మేలు జరుగుతుందన్నారు. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అయితే టిక్కెట్ల ముందే ప్రకటిస్తే క్షేత్రస్థాయిలో మెరుగ్గా పనిచేసుకోగల్గుతారన్నారు.

ఇక ఈ నెల 30వ తేదీన కొల్లాపూర్‌లో జరిగే భారీ బహిరంగ సభకి ప్రియాంక గాంధీ వస్తున్నారన్నారు. అదే సభలో మహిళా డిక్లరేషన్​ప్రకటిస్తారన్నారు.కొల్లాపూర్ సభ కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సన్నాహక మీటింగ్ నిర్వహిస్తామన్నారు. సభ కోసం మహిళలను ఎక్కువగా తీసుకువచ్చేలా ప్లాన్చేస్తున్నామన్నారు.

మరోవైపు ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి పార్టీలో చేరుతారన్నారు.

ఇప్పటికే గద్వాల జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య ఆ జిల్లా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు భారీగా చేరారన్నారు.కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనే ఆలోచన ఎవరికీ లేదన్నారు. బీసీలకు ప్రకటించే 40 స్థానాలను వెంటనే గుర్తించాలన్నారు. అందరం సర్దుకొని ఐక్యంగా ముందుకు వెళ్తామన్నారు.

ఆదివాసీ కాంగ్రెస్నాయకుడు బెల్లయ్య నాయక్మాట్లాడుతూ 29వ తేదీ ప్రకాశం హల్‌లో మణిపూర్ వెనుక కుట్ర కోణంపై ఆదివాసీ సంఘాలతో సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ఇంచార్జీ థాక్రే, పీసీసీ చీఫ్రేవంత్ రెడ్డిలు హాజరు అవుతారన్నారు.

Related posts

మార్పుల‌కు, విప్ల‌వానికి ఓయూ కేంద్రం

Sub Editor

లైసెన్సు లేకుండా విత్తనాలు అమ్ముతున్న వారిపై కేసు

Satyam NEWS

కరోనా హెల్ప్: సమాజ హితులు జర్నలిస్టులు

Satyam NEWS

Leave a Comment