33.2 C
Hyderabad
June 26, 2024 19: 47 PM
Slider ప్రత్యేకం

గిరిజనుల్లో పౌష్టికాహారలోప నివారణకు పటిష్ట చర్యలు

#gummadisandhyarani

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భణీలు,చిన్నారులు,గిరిజనులు పౌష్టికాహార లోపంతో ఏఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర సచివాలయం మూడవ భవనంలో ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారులు సరిగాలేని అంబులెన్సులు వెళ్లడానికి అవకాశం లేని చోట్ల ఫీడర్ అంబులెన్సులను(ద్విచక్ర వాహన)తిరిగి ప్రవేశ పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గత ఐదేళ్ళ కాలంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే వారిని మనుషుల భుజాలపైన లేదా డోలీలపై మోసుకుని రావడం నిత్యం మనం మీడియాలో చూస్తున్నామని అన్నారు.ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా ఫీడర్ అంబులెన్సులను అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. గర్భిణీలు, చిన్నారులు లేదా గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరూ పౌష్టికాహార లోపంతో చనిపోకుండా నివారించేందుకు ఈప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.

ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్ధుల ఆరోగ్య పరిరక్షణకు ఎఎన్ఎంలు అందుబాటులో ఉండేవారని కాని గత ప్రభుత్వం ఆవిధానానికి స్వస్తి చెప్పడంతో విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కావున వారి ఆరోగ్య పరిరక్షణకు 544 ఎఎన్ఎంలను ఆశ్రమ పాఠశాలల్లో నియమించేందుకు తగిన దస్త్రంపై మంత్రి సంధ్యారాణి తొలి సంతకం చేశారు. గతంలో సాలూరు నియోజకవర్గంలో దేశంలోనే గుర్తింపు పొందిన గిరిజన గర్భిణీల స్త్రీల వసతి గృహం ఉండేదని గుర్తు చేశారు.

మరలా అలాంటి వసతి గృహాలను వివిధ గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో ఐటిడిఏలు, ఐసిడిఎస్ ప్రాజెక్టులను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు చర్యలు తీసుకుని తద్వారా ప్రజలకు ముఖ్యంగా గిరిజనులు,మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సంధారాణి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్యం,తాగునీరు,రహదారులు,పౌష్టికాహార లోప నివారణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడం జరుగుతుందని గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గత ఐదేళ్ళ కాలంలో గిరిజనులు,మహిళలు ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ జెవి మురళి,గురుకుల సొసైటి కార్యదర్శి సదా భార్గవి,గిరిజన సంక్షేమశాఖ ఇఎన్సి శ్రీనవాస్,ఎండి జిసిసి సురేశ్ తదితర అధికారులు మంత్రి సంధ్యారాణికి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంకా ఈకార్యక్రమంలో పలువురు గిరిజన సంక్షేమం,స్ర్తీశిశు సంక్షమ శాఖల అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోజువారీ జీవితంలో ఉపయోగించే సైన్స్ మీద కార్యశాల

Satyam NEWS

ఇక్కడే ఉండు… అవినీతి చెయ్యి… మాకు వాటా ఇయ్యి

Satyam NEWS

హైదరాబాద్ నుంచి కొలంబోకు డైరెక్ట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం

Satyam NEWS

Leave a Comment