39.2 C
Hyderabad
May 3, 2024 14: 10 PM
Slider ప్రత్యేకం

రోజువారీ జీవితంలో ఉపయోగించే సైన్స్ మీద కార్యశాల

#workshop

రోజువారీ జీవితంలో ఉపయోగించే సైన్స్, దాని ప్రాముఖ్యత గురించి నేడు సిబిఐటిలో  ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మరియు  ఈడిసి సంయుక్తం గా  వివిధ సమస్యల  పరిష్కారం, ఆలోచనలపై కార్యశాలను నిర్వహించారు. ఇన్నోవేషన్ మెథడాలజీ, ఫ్రేమ్‌వర్క్, బిల్డ్ ఆన్ స్కిల్స్, టూల్స్, బ్రెయిన్ స్ట్రోమింగ్, ఐడియేషన్ అనే అంశాలు మీద చీఫ్ మెంటార్, డైరెక్టర్ – బట్టర్ ఫ్లై  ఎడ్యుఫీల్డస్ ప్రొఫెసర్ జి సురేందర్ రెడ్డి మాట్లాడారు.

ఈ కార్యశాల లో మొదటి అంశం సమస్యను నిర్వచించటం, సాధ్యమయ్యే అన్ని పరిష్కారాలను జాబితా చేయడం, ఎంపికలను మూల్యాంకనం చేయడం, ఉత్తమ పరిష్కారాన్ని ఎంచుకోవటం, అమలు ప్రణాళికను రూపొందించటం, పరిష్కారాన్ని తెలియజేయటం గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం మన శాస్త్రవేత్తల ప్రతిభకు, పట్టుదలను గుర్తు చేసే దినం.

మన  రోజువారీ జీవితంలో ఉపయోగించే సైన్స్ ప్రాముఖ్యత గురించి, మానవ సంక్షేమం కోసం సైన్స్ రంగంలో వివిధ శాస్త్రవేత్తల కృషిని, విజయాలను  యువతరానికి చెప్పే ఒక మంచి అవకాశం అనే అన్నారు. ఈ వర్క్‌షాప్ కో-ఆర్డినేటర్లు గా ప్రొఫెసర్ పి నరహరి శాస్త్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంధ్య వ్యహరించారు. ఈ సందర్బం గా ఐ మరియు ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉమాకాంత చౌదరి, కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణపై దాడి

Satyam NEWS

పోలీసులకు ఇంకా దొరకని తబ్లిగీ జమాత్ నాయకుడు

Satyam NEWS

దుర్గామాత ఆశీస్సులు తీసుకున్న బిజెపి నాయకులు

Satyam NEWS

Leave a Comment