40.2 C
Hyderabad
April 28, 2024 18: 05 PM
Slider పశ్చిమగోదావరి

ఇక్కడే ఉండు… అవినీతి చెయ్యి… మాకు వాటా ఇయ్యి

#curruption

రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు తమ సొంత ఆదాయం కోసం అక్రమాలు చేసే ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తుంటారు…. అని మనం విని ఉంటాం. అయితే పశ్చిమ గోదావరి జిల్లా  పెద వేగి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఈ తంతు చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఇక్కడ పని చేసే ఓ ఉద్యోగి డెప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్నాడు. సదరు ఉద్యోగి డెప్యుటేషన్ విధుల కాల పరిమితి ముగియడం తో జిల్లా అధికారులు ఆ ఉద్యోగిని తిరిగి గతంలో పర్మినెంట్ విధులు నిర్వహించే కార్యాలయానికి  వెళ్లి విధులు నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతను అక్కడ నుంచి మదర్ డిపార్టు మెంటుకు వెళ్లిపోవాలి కదా? అయితే అతను మాత్రం అక్కడ నుంచి కదలడం లేదు. మదర్ డిపార్టు మెంట్ కు బదిలీ చేసిన ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఉండిపోవాల్సిందిగా కొంత మంది రాజకీయ  నాయకులు ఆదేశించారు. మరింకేం…. అతను అక్కడే ఉండిపోయాడు. డెప్యుటేషన్ రద్దు చేస్తూ రెగ్యులర్ విధులు నిర్వహించే కార్యాలయానికి వెళ్లాలని వచ్చిన ఉత్తర్వులను ఈ రాజకీయ నాయకులు, కొందరు ఉన్నతాధికారులు పక్కన పెట్టించినట్టు తెలిసింది. ఇదే ఉద్యోగి పై మండలానికి 2018లో మంజూరైన ఆదరణ యూనిట్లలో కొన్ని విలువైన  ఆదరణ యూనిట్ల ను దారి మళ్లించి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణ ఉంది. ఇప్పటికి కొన్ని యూనిట్లు మండల పరిషత్ కార్యాలయంలో లబ్ది దారులకు చేరకుండా దాచి ఉంచారని తెలిసింది. అయినా ఇతనే అక్రమార్కులకు ముద్దువస్తున్నాడు. ఏం చేస్తాం…???

Related posts

రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి బుగ్గనకు చేదు అనుభవం

Satyam NEWS

పెద్ద మనసును చాటుకున్న రవాణా మంత్రి పువ్వాడ

Satyam NEWS

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

Satyam NEWS

Leave a Comment