23.7 C
Hyderabad
June 28, 2024 07: 17 AM
Slider చిత్తూరు

ధర్మారెడ్డిని వెంటనే ప్రాసిక్యూట్ చేయాలి

#naveenkumarreddy

తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బిజెపి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించాలని ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నాను అని ఆయన తెలిపారు లేనిపక్షంలో కంప్యూటర్ ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

టిటిడిలో “రివర్స్ టెండరింగ్” పేరుతో మూడు నామాల స్వామికే పంగనామాలు పెట్టారని ధర్మారెడ్డి ధర్మకర్తల మండలి మెప్పుకోసం టీటీడీ లో అర్హత లేని ప్రధాన గణాంక అధికారి “అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు” వెంకన్న సొమ్మును ఇస్తాను సారంగా ఆమోద ముద్ర వేశారన్నారు. టీటీడీ ఈవో ప్రధాన గణాంకాధికారి చీఫ్ ఇంజనీర్ ఇంజినీరింగ్ టెక్నికల్ అడ్వైసర్ లను సిఐడి అధికారులు ప్రాసిక్యూట్ చేయాలన్నారు.

తిరుపతిలోని డి ఆర్ మహల్ వద్ద గల గోవిందరాజ సత్రాలను ఆగమేఘాల మీద కూల్చివేసి పునర్నిర్మాణం కోసం 600 కోట్ల రూపాయలను ఒక్కసారిగా కమిషన్ల కోసం కేటాయించడం దుర్మార్గమన్నారు. టీటీడీలో గత ఐదు సంవత్సరాలుగా ధర్మకర్తల మండలి లో ఇంజనీరింగ్ పనుల కోసం ఎన్ని కోట్లు నిధులు మంజూరు చేశారు ఎంత ఎక్సెస్ పర్సంటేజ్ కి టెండర్లు ఆమోదించి కమిషన్లు దండుకున్నారో నిగ్గు తేలాలి.

టిటిడి ఇంజనీరింగ్ కు గతంలో ప్రతి ఏటా 150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఇటీవల ఉన్నపలంగా ఏకంగా 1,500 కోట్లను టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎవరి అనుమతితో ఆమోదముద్ర వేశారో “కాగ్” CAG (కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) తో ఆడిట్ జరిపించేలా ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాను. స్విమ్స్ హాస్పిటల్ లో రెనోవేషన్ (RENOVATION ),మెయింటెనెన్స్ పేరుతో సుమారు 200 కోట్ల రూపాయలను కేటాయించిన పనులపై సిఐడి అధికారులు దృష్టి సారిస్తే నమ్మలేని నిజాలు భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వస్తుందన్నారు.

టిటిడిలో శ్రీవారి సొమ్మును ఇంజనీరింగ్ పనుల పేరుతో మంచినీళ్లలా టేబుల్ అజెండా కింద ఆమోదముద్ర వేసుకొని అధిక శాతానికి కొంతమంది కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకున్న దానిపై సిఐడి అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టేలా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాను.టీటీడీలో సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ ను కమిషన్ల కోసం అనవసరంగా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ దశలో ఉన్న అన్ని పనులను రద్దు చేసి శ్రీవారి సొమ్ముని కాపాడే బాధ్యతను ఓ భక్తునిగా ఎన్డీఏ కూటమి స్థానిక నాయకునిగా తాను తీసుకుంటానని నవీన్ హెచ్చరించారు.

Related posts

గిద్దలూరు ఎమ్మెల్యేను ఏం చేయాలి…..?

Satyam NEWS

తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు

Satyam NEWS

పోలీస్ స్టేషన్ లోనే రిలే నిరాహార దీక్షలు

Satyam NEWS

Leave a Comment