33.2 C
Hyderabad
June 26, 2024 19: 45 PM
Slider కృష్ణ

ఎన్నికల హామీలు అమలు చేస్తున్న చంద్రబాబు

#KagithaKrishnaPrasad

అధికారం చేపట్టిన తొలి రోజే మెగా డీఎస్సీ పై సంతకం పెట్టడం, జగన్ రెడ్డి ప్రభుత్వం కిరాతకంగా అమలు చేసిన లాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడంతో చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలను అమలు చేయడం ప్రారంభించారని పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి పార్టీ కార్యాలయంలో నేడు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాగిత  కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు. అన్న క్యాంటీన్ల పునరుద్దీకరణ, అవ్వ తాతలకు  4000 పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. అదే విధంగా విద్యార్థుల భవిష్యత్తు  దృష్ట స్కిల్ డెవలప్మెంట్ ఫైల్ పై సంతకం చేయడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిక్కిలి సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు పోలవరం పర్యటన నిర్వహించి అధికారులతో సమీక్ష రివ్యూ చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన  పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబు పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి మార్గంలో దూసుకుపోవడం తధ్యమని ఆయన అన్నారు. ప్రజల స్థితిగతులు కూడా మార్పులు సంభవించి సంతోషంగా వారి జీవనం కొనసాగుతుందని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా దృష్టి సారించి ప్రతి సమస్యను పరిష్కార దిశగా తీసుకువెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దానని కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మదినగూడ నారాయణ పాఠశాలలో ఘనంగా మ్యాథమాటిక్స్ డే..

Satyam NEWS

రాఖీలు కట్టి ఆశీర్వదించమని అడిగిన రెండవ ఏఎన్ఎంలు

Bhavani

దేవాడలో దళితులపై అగ్రవర్ణాల దాడి

Satyam NEWS

Leave a Comment