31.7 C
Hyderabad
May 2, 2024 09: 36 AM
Slider నిజామాబాద్

దేవాడలో దళితులపై అగ్రవర్ణాల దాడి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో ఆదివారం భారత రాష్ట్ర సమితి BRS కార్యకర్తలు, అగ్రవర్ణ నాయకులు దళిత నిరుద్యోగ యువకులపై దాడికి పాల్పడ్డారు. Brs అభ్యర్థి హనుమంత్ షిండే ప్రచారానికి వస్తున్నారన్న సమాచారంతో కొంతమంది డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగ యువకులు ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యలను వివరించడానికి ఎన్నో ఆశతో గ్రామ చావడి వద్ద వచ్చారు.

గ్రామంలోని కొందరు అగ్రవర్ణాల పెద్దలు, BRS నాయకులు దళిత నిరుద్యోగ యువకులపై దాడికి పాల్పడ్డారు. దీంతో దళితులకు తీవ్ర గాయాలయ్యాయి. సమస్య వివరించడానికి వచ్చిన కొందరు దళితులపై దాడికి పాల్పడ్డారని సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, దళితులు అందరూ రోడ్డుపైకి వచ్చి ప్లే కార్లు చూ పిస్తూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రావడంలేదని ఆవేదన తెలపడానికి వచ్చిన వారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

BRS నాయకులు ఇష్ట రాజ్యాంగ బూతులు తిడుతూ చితక బాదడం తో గంటపాటు వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత అభ్యర్థి హనుమంత్ షిండే గ్రామానికి చేరుకున్నప్పటికీ వారిని పలకరించకపోవడంతో వారు తమ నిరసనను తెలియజేస్తున్నప్పటికీ దళిత ఎమ్మెల్యే ఉండి దళితుల సమస్యలు వినకపోవడం బాధాకరమని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులను పిలిపించి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అరెస్ట్ చేయాలని కార్యకర్తలే పోలీసులకు చెప్పడం గమనార్హం.

దళితుల గొంతును పోలీసులు, బిఆర్ఎస్ కార్యకర్తలు అణచివేయలేరని దళితులు అంటున్నారు. నాటి నుంచి నేటి వరకు మాకు అణ చివేతకు గురి చేస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల దాడులు జరగడం అన్యాయమని దీనిపై దళిత సంఘాలు కలిసి రావాలని కోరారు. తమపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు మా దరఖాస్తులు స్వీకరించకపోతే తాము జిల్లా ఎస్పీ తో పాటు, మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఆశ్రయిస్తామన్నారు. ముందు ముందు ఈ ఘటన ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

జి లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

ఏపి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్

Satyam NEWS

హైదరాబాద్‌ గుంటూరు రోడ్డు 4 వరసలకు విస్తరించండి

Satyam NEWS

కరోనా ఎలర్ట్: గచ్చిబౌలి లో మరో క్వారంటైన్ సెంటర్

Satyam NEWS

Leave a Comment