27.7 C
Hyderabad
May 15, 2024 06: 28 AM
Slider ఖమ్మం

రాఖీలు కట్టి ఆశీర్వదించమని అడిగిన రెండవ ఏఎన్ఎంలు

#Rakhis

తమను బే షరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్ఎంల సమ్మె 15వ రోజు అధికారులకు ప్రజా ప్రతినిధులకు రాఖీ కట్టి తమకు రెగ్యులరేషన్ అయ్యేలా ఆశీర్వదించమని అడిగారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బడేటి వనజ, కార్యనిర్వహక అధ్యక్షురాలు సిహెచ్ విజయ కుమారి లు ఖమ్మం కలెక్టర్ తో పాటు వివిధ శాఖ ఉన్నత అధికారులకు రక్షాబంధన్ కట్టి తాము త్వరలోనే రెగ్యురేషన్ అయ్యేలా ఆశీర్వదించాలని కోరారు. ఎందుకు స్పందించిన కొంతమంది అధికారులు మీ కోరికలు ఫలించాలని మేము కూడా కోరుకున్నట్లు వాళ్ళకి తెలియజేశారు. ఈ సందర్భంగా వనజ విజయ లు మాట్లాడుతూ రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా తాము చేస్తున్న పోరాటం ఈరోజుకు 15 రోజులకు చేరుతుందన్నారు.

గతంలో 47 రోజుల పాటు సమ్మె చేసిన అనుభవం ఉందని వారు తెలియజేశారు. కరోనా కష్టకాలంలో మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే ప్రశంస సోకాజ్ నోటీసేన అని వారు ప్రశ్నించారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని వారు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన వాళ్లతో గత ఆదివారం అభిప్రాయ సేకరణ చేసిన సమయంలో 30 జిల్లాలు హాజరవగా 23 జిల్లాల వారు రెగ్యులరైజేషన్ కోసమే చేయాలని నిర్ణయించినట్లు వారి సందర్భంగా తెలియజేశారు. అందులో భాగంగానే మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించి సమ్మెను కొనసాగిస్తున్నామని వారన్నారు. నోటీసులు ఇచ్చి భయపెట్టే మమ్మల్ని చర్చకు పిలిచి మా సమస్యల పరిష్కారం చేయడం ప్రభుత్వానికి ఉత్తమమైన మార్గమని వారు అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తు రోజులలో పోరాటాన్ని తీవ్రతనం చేయనున్నట్లు తెలిపారు. టెంటు వద్దకు విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, జిల్లా అధ్యక్షులు గాదే లక్ష్మీనారాయణ, తెలంగాణ వైయస్సార్ పార్టీ నాయకులు, టీటీడీపీ నాయకులకు ఈ సందర్భంగా వారు రాఖీలు కట్టి తమ న్యాయమైన కోరిక రెగ్యులర్ కోసం ఆశీర్వాదం తీసుకున్నారు.

Related posts

బీజేపీ మేనిఫెస్టో!

Sub Editor

టైక్వాండో శిక్షణా తరగతులను ప్రారంభించిన ములుగు సీఐ

Satyam NEWS

పిల్లలకు టీకా రేపటి నుంచే: వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలు ఇవే

Satyam NEWS

Leave a Comment