33.2 C
Hyderabad
June 26, 2024 19: 32 PM
Slider హైదరాబాద్

యుపిఎస్‌సి అభ్యాస్ ప్రిలిమ్స్‌ను నిర్వహించిన విజన్ ఐఏఎస్

#visionIAS

ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ టీచింగ్‌లో అగ్రగామి సంస్థ అయిన విజన్ ఐఏఎస్, భారతదేశంలోని 100కి పైగా నగరాల్లో  యుపిఎస్‌సి అభ్యాస్ ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. UPSC అభ్యాస్ ప్రిలిమ్స్ ఏ వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ (హైదరాబాద్‌లోని ఆఫ్‌లైన్ సెంటర్) లో జరిగింది.  హైదరాబాద్‌లో 1,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 28,000 మందికి పైగా దీనిలో పాల్గొననున్నారు. హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, ఢిల్లీ, గౌహతి,  జైపూర్, జోధ్‌పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, పూణే మరియు రాంచీ సహా పలు నగరాల్లోని వివిధ కేంద్రాలలో పరీక్ష జరుగుతుంది.

యుపిఎస్‌సి ప్రిలిమ్స్ పరీక్ష యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రయాణానికి నాంది పలికుతుంది. దీని ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఆబ్జెక్టివ్ థింకింగ్ మరియు రీజనింగ్ స్కిల్స్‌ను విశ్లేషించడంలో, పెంపొందించడంలో ఔత్సాహికులకు సహాయపడేందుకు విజన్ ఐఏఎస్ అభ్యాస్ ప్రిలిమ్స్‌ను నిర్వహిస్తోంది.

విజన్ఐఎఎస్, హైదరాబాద్,  బ్రాంచ్ హెడ్  హరేకృష్ణ సింగ్ మాట్లాడుతూ ‘యుపిఎస్‌సి అభ్యర్థులకు ఇది సంతోషకరమైన రోజు. దేశవ్యాప్తంగా 100కి పైగా పరీక్షా కేంద్రాలలో అభ్యాస్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 3లో హాజరయ్యే అభ్యర్థులకు విజన్ఐఎఎస్ తన తలుపులు తెరుస్తోంది. వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు నిజమైన యుపిఎస్‌సి ప్రిలిమ్స్ అనుభవాన్ని పొందేలా  రూపొందించబడిన వాతావరణంలో తమకు కేటాయించిన కేంద్రాలలో పరీక్ష రాస్తున్నారు. ఇది వారి పరీక్ష సంసిద్ధత ను పరీక్షించటం తో పాటుగా  జాతీయ స్థాయిలో తులనాత్మక విశ్లేషణను అందిస్తుంది.

కఠోరమైన అభ్యాసం ద్వారా ఆశావహులకు మార్గనిర్దేశం చేయడంలో ఈ సిరీస్  కీలకపాత్ర పోషిస్తుంది, వారి బలాలు గుర్తించటం మరియు అభివృద్ధి చేసుకోవాల్సన అంశాలను వెల్లడించటం చేస్తుంది. ప్రారంభించినప్పటి నుండి, అభ్యాస్ దేశవ్యాప్తంగా యుపిఎస్‌సి  సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో రాణించాలనే లక్ష్యంతో వున్న అందరినీ ఏకం చేస్తుంది” అని అన్నారు

అభ్యాస్ ప్రిలిమ్స్ అంటే

అభ్యాస్ ప్రిలిమ్స్ అనేది యుపిఎస్‌సి ప్రిలిమ్స్ పరీక్ష యొక్క వాస్తవిక అనుభవాన్ని ఔత్సాహికులకు అందించడానికి రూపొందించబడిన కార్యక్రమం. ఈ పరీక్షలో పాల్గొనడం ద్వారా, ఔత్సాహికులు పోటీ పరీక్ష పై తగిన పరిజ్ఞానం పొందుతారు. తమ వ్యూహాలను మెరుగుపరచుకోవడానికి , తార్కిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి నిర్మాణాత్మక అభిప్రాయాన్ని పొందుతారు.

అభ్యాస్ ప్రిలిమ్స్ ఎందుకు?

జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఖచ్చితమైన సంసిద్ధత అవసరం. అభ్యాస్ ప్రిలిమ్స్ పోటీని అంచనా వేయడానికి , తమ  వ్యూహాలను సమర్థవంతంగా రూపొందించడంలో సహాయపడుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది , యుపిఎస్‌సి ప్రిలిమ్స్‌లో విజయానికి కీలకమైన పరీక్ష వాతావరణంపై సమగ్ర అవగాహనను అందిస్తుంది.

పరీక్ష ఫార్మాట్

యుపిఎస్‌సి  ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ I (GS) మరియు పేపర్ II (CSAT). అభ్యాస్ ప్రిలిమ్స్ ఈ ఫార్మాట్‌కు అద్దం పడతాయి, రెండు పేపర్లు మే 26న 100+ నగరాల్లోని సంబంధిత పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడతాయి. పాల్గొనేవారికి ఆల్ ఇండియా ప్రాతిపదికన ర్యాంక్ ఇవ్వబడుతుంది.

Related posts

సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల జీతం ఎప్పుడు?

Satyam NEWS

నరసరావుపేట లో పర్యటించిన సినీ నటుడు శివాజీ

Satyam NEWS

మతి తప్పి మాట్లాడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment