41.2 C
Hyderabad
May 4, 2024 18: 51 PM
Slider ఆంధ్రప్రదేశ్

సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల జీతం ఎప్పుడు?

sarvaskisha

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టులో లో వివిధ విభాగాల్లో సుమారు 27 వేల మంది పని చేస్తున్నారు. అయితే ముఖ్యంగా గత మూడు నెలల నుంచి 13 జిల్లాలో ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్థులకు జీతాలు అందడం లేదు.

ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు, కే.జీ.బీ.వీ, బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులు, ప్రత్యేక మహిళ అధికారులు, ఇంటర్ మీడియట్ కళాశాల  మహిళ అధ్యాపకులకు జీతాలు అందని పరిస్థితి ఉంది.

అదే విధంగా సి.ఆర్పి.లకు, మండల విద్యాశాఖ లో పనిచేస్తున్న కార్యాలయ బోధనేతర సిబ్బంది, సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పని చేస్తున్న ఒప్పంద సిబ్బందికి, పొరుగు సేవల సిబ్బందికి కే.జీ.బీ.వీ, బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి కూడా జీతాలు రావడం లేదు.

దీనికితోడు ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇప్పటికైనా వీరికి ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

 ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది కి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ చిన వీరభద్రుడు ను కోరుతున్నారు.

Related posts

కేంద్రం తెస్తున్న విద్యుత్ బిల్లుకు మేం వ్యతిరేకం

Satyam NEWS

ఉపాధి పనులపై శ్రద్ధ చూపని ఎంపిడివోపై వేటు

Satyam NEWS

2024 ఎన్నికలలోనూ ఎవరితో పొత్తు లేదు

Satyam NEWS

Leave a Comment