25.7 C
Hyderabad
June 26, 2024 05: 52 AM
Slider ప్రత్యేకం

ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

#rains

ఐఎండి సూచనల ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని ప్రస్తుతానికి దీని వలన ఏపీకు ఏటువంటి ముప్పులేదని తెలిపారు. శని, ఆదివారాల్లో  చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు.    

రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో  అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు  చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

రేపు శ్రీకాకుళం 9, విజయనగరం 11 , పార్వతీపురంమన్యం 11,  కాకినాడ 1, తూర్పుగోదావరి గోకవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. గురువారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.9°C, వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురం, ఎన్టీఆర్ నందిగామలో 40.7°C, పల్నాడు జిల్లా నరసరావుపేటలో40.3°C, ప్రకాశం జిల్లా కనిగిరిలో 40.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts

23న హైదరాబాద్ లో ఎగుమతులను పెంచడానికి వాటాదారుల ఔట్రీచ్

Satyam NEWS

జగన్ ముందు మంత్రులు… పదును లేని కోరలు…

Satyam NEWS

పత్రికలను టార్గెట్ చేయటం ముఖ్యమంత్రి పిరికితనం కాదా?

Satyam NEWS

Leave a Comment