38.2 C
Hyderabad
May 2, 2024 21: 39 PM
Slider ముఖ్యంశాలు

పత్రికలను టార్గెట్ చేయటం ముఖ్యమంత్రి పిరికితనం కాదా?

#potulabalakotaiah

ముఖ్యమంత్రి హోదాలో అధికార వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశాల పేరిట పత్రికలు, మీడియా సంస్థలపై విషం కక్కటం, విరుచుకు పడటం పిరికితనం కాదా అని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా తాను చేసిన అభివృద్ధి పనులను, ప్రత్యర్థి పార్టీలు చేయని పనులను ప్రజలకు చెప్పి ఆకట్టుకుంటారని, కానీ ముఖ్యమంత్రి మీడియా వ్యవస్థను టార్గెట్ చేసి దగ్గరుండి నాయకులతో దూషణలు చేయించటం, తానూ దూషించటం సిగ్గు చేటు అని అన్నారు.

‘100 తుపాకులకు భయపడను కానీ, నాలుగు పత్రికలకు భయపడతాను’ అన్న నియంత నెపోలియన్ తమ్ముడిలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేశారని చెప్పారు. ప్రభుత్వమే సొంతంగా ఒక పత్రిక, ఒక ఛానల్ నిర్వహిస్తూ, వందల వేలల్లో కూలి సోషల్ మీడియాని పోషిస్తూ, ప్రజల పక్షం నిలబడ్డ నాలుగు మీడియా సంస్థలపై, వారి ఎదుగుదలపై దాడి చేయటం ప్రజలపై దాడి చేయటమే అన్నారు.

ప్రజాస్వామ్యానికి ప్రతీకలు పత్రిక లేనని,అలాంటి పత్రికలను తొక్కి పెట్టాలనుకున్న పాలకులు చరిత్రలో కనిపించకుండా పోయారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అన్యాయాలకు అవినీతికి వ్యతిరేకించే మీడియాను దళిత, బహుజన కులాలు కాపాడుకుంటాయని బాలకోటయ్య స్పష్టం చేశారు.

Related posts

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై మండిపడ్డ నిర్మల్ బిజెపి

Satyam NEWS

ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు

Bhavani

రైతుల్లో ధైర్యం నింపేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment