24.7 C
Hyderabad
June 23, 2024 08: 31 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో ఆది శంకరాచార్యుల జయంతి

#adishankara

అపరవాల్మికి శ్రీ శివానందుల వారి శిష్యులు, మౌన స్వామి శ్రీ స్వామి రామానందుల వారు స్థాపించిన విజయనగరం కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమంలో “ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ అంతర్ముఖానందుల (శ్రీగురూజీ) ఆదేశాలతో శ్రీగురూజీ సుపుత్రుడైన శివరామకృష్ణ దంపతులు…. అటు స్వామిజీ సమాధి మందిరంలోనూ, ఇటు ఆశ్రమ పీఠంలోనూ ఆది శంకరాచార్య జయంతి ఉత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో శంకరాచార్య సహస్రం, శ్రీ గురుగీత, గురర్వాష్ఠకం, తదితర గ్రంధాలను చదివారు. అనంతరం ఉత్సవంకు వచ్చిన శిష్యులకు ప్రసాదాలను అందించారు… ఆశ్రమ నిర్వాహకులు. ఈ ఉత్సవ కార్యక్రమంలో శ్రీగురూజీ కూతురు ఘాన్సీ దంపతులతో పాటు పలు ప్రాంతాల నుంచీ శిష్యులు హాజరయ్యారు.

Related posts

ఆకాశగంగ వద్ద 4 నుంచి 8 దాకా వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు

Satyam NEWS

త్వరలో ఐఐటీ-జేఈఈ ఫోరం జేఈఈ (మెయిన్), అడ్వాన్స్డ్ గ్రాండ్ టెస్ట్స్

Satyam NEWS

హైదరాబాద్ అభివృద్ధికి గులాబీ అభ్యర్ధులకే మీ ఓటు

Sub Editor

Leave a Comment