30.7 C
Hyderabad
April 29, 2024 06: 13 AM
Slider ముఖ్యంశాలు

త్వరలో ఐఐటీ-జేఈఈ ఫోరం జేఈఈ (మెయిన్), అడ్వాన్స్డ్ గ్రాండ్ టెస్ట్స్

iit jee

ఐఐటీ-జేఈఈ ఫోరం ఆధ్వర్యంలో జేఈఈ (మెయిన్ ), అడ్వాన్స్డ్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ ని విద్యార్థుల కు ఉచితంగా అందజేయన్నట్లు  ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. జేఈఈ (మెయిన్ ) 2020 సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్స్, కీ తో సహా విద్యార్థుల అవగాహన కోసం మొబైల్ వెర్షన్ ను పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉచితంగా అందిస్తారు. అదే విధంగా అడ్వాన్స్డ్ సంబంధించి 5 గ్రాండ్ టెస్ట్స్ పేపర్ -1, పేపర్ -2, కీ తో సహా  జేఈఈ విద్యార్థుల అవగాహన కోసం ఉచితంగా మొబైల్ వెర్షన్ ద్వారా పిడిఎఫ్ కాపీ ని వాట్సాప్ ద్వారా అందచేస్తారు.

ఇటీవల ఆరు సంవత్సరాల పేపర్లను, అవగాహన కోసం ర్యాంకులు తదితర వివరాలను బుక్ లెట్ రూపంలో అందించిన ఐఐటీ-జేఈఈ ఫోరం విద్యార్ధుల సౌకర్యార్ధం ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఆసక్తి గల విద్యార్ధులు 98490 16661 కు ‘ గ్రాండ్ టెస్ట్ ‘ అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా లలిత్ కుమార్ కోరుతున్నారు.

Related posts

విద్యా ప్రమాణాలు పెంచేందుకు బిఎల్ఆర్ ట్రస్ట్ కృషి

Bhavani

74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

డిప్యూటీ సీఎం కళత్తూరు కలలు కనడం మానేయాలి

Satyam NEWS

Leave a Comment