29.7 C
Hyderabad
May 1, 2024 07: 44 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ అభివృద్ధికి గులాబీ అభ్యర్ధులకే మీ ఓటు

KCR-makes

డిసెంబర్ 1 న జరిగే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత, ఆరేండ్ల కింద హైదరాబాద్ కు, ఇప్పటి హైదరాబాద్ కు ఎంతో పురోగతి ఉందన్నారు.

హైదరాబాద్ మహా నగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతి భద్రతలు, ఇవన్నీ సీఎం కేసీఆర్ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కారణంగానే ఇంత గొప్పగా ఉన్నాయని తెలిపారు.

ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ ప్రజలపై ఉందన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ నగరం వరుసగా ఐదేండ్లుగా ఇండియాలో బెస్ట్ సిటీగా ఉందని మర్సర్ వంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇలాంటి ర్యాంకులు, గొప్ప పరిస్థితులు కేవలం మాటలతో రావని…ఎంతో కష్టపడితే మాత్రమే సాధ్యమవుతాయన్నారు. హైదరాబాద్ లో ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

Related posts

కోర్టు అక్షింతల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Satyam NEWS

రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు బంద్ చేయాలి

Satyam NEWS

కొత్తగా అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్

Satyam NEWS

Leave a Comment