31.7 C
Hyderabad
June 24, 2024 17: 12 PM
Slider ఆధ్యాత్మికం

వైభవంగా చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ట

#chennakeswaraswamy

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల గ్రామంలో చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందు లో భాగంగా మొదటిరోజు  ఉదయం గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచాంగం వ్యసనం, యాగశాల ప్రవేశం, ద్వార పూజ, షోడ స్తంభ పూజ, సర్వతోభద్ర మండల నవగ్రహ వాస్తు కలశాల స్థాపన, విగ్రహ యంత్ర అభిషేకం, జలాధివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామంలోని పురవీధుల గుండా శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సాహ విగ్రహ మూర్తులను ఊరేగించారు. చిన్నారుల కోలాటాల కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు బాలాజీ రావు, విజయ్ శర్మ,  ప్రకాష్ గౌడ్, భాస్కర్ గౌడ్ మరియు యువజన సంఘం నాయకులు రాజేందర్ గౌడ్ రాజశేఖర్ నరేష్ రామకృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.   

Related posts

ట్రాన్సజెండర్లకు గుర్తింపు కార్డులు

Bhavani

“Master” Problem: రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ

Satyam NEWS

Over The Counter Siddha Medicines For Diabetes In Chennai Cures For Diabetes 2022

Bhavani

Leave a Comment