36.2 C
Hyderabad
May 14, 2024 15: 25 PM
Slider ప్రత్యేకం

“Master” Problem: రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ

#kamareddy

మాస్టర్ ప్లాన్ మంటలు ఆరడంలేదు. రోజురోజుకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య ఘటన అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. రైతు మృతితో ఒక్కసారిగా కామారెడ్డి రణరంగంలా మారింది. మూడు రోజులుగా మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం రాములు మృతి అనంతరం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రైతు కుటుంబాలతో భారీ ర్యాలీ చేపట్టడంతో కలెక్టరేట్ ముట్టడించారు.

రాత్రి వరకు రైతులు ఆందోళనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో కలెక్టర్ బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయడం, రైతులకు మద్దతుగా ఐదు గంటల పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధర్నాలో పాల్గొనడం, కలెక్టర్ రాకవడంతో పాటు పొలిటికల్ మోబ్ అనే పదం వాడటంతో కలెక్టర్ కు రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. 

పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిన్న రైతుల బంద్ నేపథ్యంలో బండి సంజయ్ పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి సంజయ్ పర్యటన సాయంత్రం వరకు ఖరారు కాకపోవడం, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బండి సంజయ్ రావడం, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి వెళ్లి రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించడం చకచకా జరిగిపోయాయి.

బండి పర్యటనలో తలెత్తిన ఉద్రిక్తత

బండి సంజయ్ అనుకోకుండా కలెక్టరేట్ ముట్టడికి పిలుపనివ్వడంతో పాటు ముట్టడిలో బండి సంజయ్ కూడా పాల్గొనడంతో పోలీసులు కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లో బారికేడ్లు ఎత్తేసి రైతులు, బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎక్కడంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు మధ్య బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ తరలించడంతో కార్యకర్తలు అడ్డుకోవడంతో లాఠీచార్జి చేసి బండి సంజయ్ ని హైదరాబాద్ తరలించారు.

ఈ రెండు ఘటనల తర్వాత నేడు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి వస్తున్నారన్న ప్రచారంతో రెండు రోజుల పాటు జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తుగానే కలెక్టర్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారి. కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రధాన గేటుని మూసివేశారు.

పక్కన ఉన్న రెండవ గేటు ద్వారా కలెక్టరేట్ సిబ్బందిని, ప్రజలను పంపిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య నేతృత్వంలో పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి వస్తారా లేదా అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకసారి వస్తారని, మరోసారి రారు అనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ రేవంత్ రెడ్డి వచ్చినా ఎలాంటి ఘటనలు జరగకుండ పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి కామరెడ్డికి వస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ముందుగా అడ్లూర్ ఎల్లారెడ్డి వెళ్లి రైతు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ కు వస్తారని తెలుస్తోంది.

కొనసాగుతున్న అరెస్టులు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొనాలని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా నేడు రేవంత్ రెడ్డి కామరెడ్డికి వస్తున్నారన్న నేపథ్యంలో పోలీసులు పలువుతును ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.

Related posts

చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వొద్దు

Satyam NEWS

రేవంత్ స్టేట్మెంట్ ను అర్ధం చేసుకోలేని కాంగ్రెస్ సీనియర్లు

Satyam NEWS

నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా చివరి క్షణం ఫస్ట్ లుక్

Satyam NEWS

Leave a Comment