40.2 C
Hyderabad
April 28, 2024 18: 16 PM
Slider ఖమ్మం

ట్రాన్సజెండర్లకు గుర్తింపు కార్డులు

#Transgenders

ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ పథకాల లబ్ది చేకూర్చుటకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులను అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో ట్రాన్స్జెండర్లకు కలెక్టర్ గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డుల కొరకు 49 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

దరఖాస్తుల క్షేత్ర స్థాయి తనిఖీలు చేపట్టి, గుర్తింపు కార్డుల జారికి చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. ఇప్పటి వరకు 20 దరఖాస్తుల తనిఖీలు పూర్తయి, కార్డుల జారికి చర్యలు తీసుకున్నట్లు, మిగతా దరఖాస్తులు క్షేత్ర తనిఖీలు చేయాల్సివుందన్నారు. ప్రతి దరఖాస్తుదారునికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఇచ్చి, కార్డుల జారికి చర్యలు చేపట్టామన్నారు.

Related posts

15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Satyam NEWS

మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు: అల్లకల్లోలంగా పాకిస్తాన్

Satyam NEWS

Leave a Comment