27.7 C
Hyderabad
May 22, 2024 03: 43 AM
Slider ముఖ్యంశాలు

అసంపూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోని రాజకీయ పెద్దలు

#ambedkar

ఎలక్షన్లు వచ్చినప్పుడే వివిధ రాజకీయ పార్టీలు గ్రామాల చుట్టూ తిరుగుతూ ఓట్లు వేయమని అడుగుతారు. కానీ, ఆ తర్వాత ప్రజల డిమాండ్లు పట్టించుకునే ఆనవాయితీ లేదు. ప్రజలు కోరే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని దుస్థితిలో ఈ సమాజం ఎందుకు ఉంది? ఈరోజు స్వేచ్ఛా జీవితం గడుపుతున్నా మంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు చావులకు పెళ్లిళ్లకు, వేలు వేలు ఖర్చు పెడతారు. కానీ నార్లాపూర్ గ్రామంలో ప్రజల కోరిక మేరకు పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించడం లేదు.

నార్లపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గతంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో ఒక దాత విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. అయితే గ్రామానికి సంబంధించిన మాదిగ మాల సోదరులు చందాలు వసూలు చేసుకుని, వాళ్ళ వంతు సహాయం తో విగ్రహాన్ని పిల్లర్ వేసి విగ్రహం పెట్టడం జరిగింది.

కానీ ఇంతవరకు విగ్రహం ఓపెనింగ్ కు నోచుకోలేని దీన స్థితిలో ఉన్నదని ఆయన అన్నారు. కనీసం ఇప్పటికైనా కొల్లాపూర్ నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు గాని ప్రతిపక్ష పార్టీ నాయకులు గాని అంబేద్కర్ విగ్రహానికి తమ వంతు సహాయం చేసి విగ్రహాన్ని ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకునే విధంగా కార్యాచరణ చేయాలని తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు డి కె మాదిగ డిమాండ్ చేశారు.

దాతలు ఎవరైనా ఉంటే అంబేద్కర్ విగ్రహానికి ఇంకా చాలావరకు వర్క్ మిగిలింది.  ఆ వర్కు పూర్తి కావడానికి దళిత విద్యార్థుల దగ్గర డబ్బులు లేవు కాబట్టి కచ్చితంగా వివిధ పార్టీల నాయకులు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.

Related posts

కడుక్కుంటే పోయేవి కాదు మమతా బెనర్జీ పాపాలు

Bhavani

సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి

Satyam NEWS

ఖమ్మం బాలికకు మెరుగైన వైద్యం అందించాలి

Satyam NEWS

Leave a Comment