24.7 C
Hyderabad
June 23, 2024 07: 58 AM
Slider ప్రపంచం

ఘోర ప్రమాదం: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్

#tehran

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని టెహ్రాన్‌​కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగరం సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. రైసీ హెలికాప్టర్ క్రాష్ వార్తల నేపథ్యంలో ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఆ దేశ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్లు టెహ్రాన్ టైమ్స్ నివేదించింది. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నారని, కాన్వాయ్‌తో తబ్రిజ్‌కు బయలుదేరారని కూడా సమాచారం వెల్లడైంది. ఇవన్నీ అనధికారిక సమాచారాలే కావడంతో తమ అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం పై ఆ దేశ ప్రజలు తల్లడిల్లుతున్నారు.

Related posts

ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పరిశ్రమలకు ఊతం

Satyam NEWS

పొలిటికల్ ఎన్ కౌంటర్ : మీలాగా బజారు భాష మాట్లాడలేను

Satyam NEWS

డైజెస్ట్:మందలింపుతో కొడుకు మృతి బాధతో తల్లి మరణం

Satyam NEWS

Leave a Comment