మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబుపేట మండలం, కొల్లూరు గ్రామంలో విషాదం నెలకుంది.చిన్నపాటి మందలింపుకే తల్లీ, కొడుకుల మృతి చెందడం వారి కుటుంబాన్ని, గ్రామస్తులను, బంధువులను కంటితడి పెట్టించింది. పోలీస్ ల కటాహణం ప్రకారం తన కుమారుడు చదువు మానేసి, పనిలేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని ఓ తల్లి మందలించడం తో మనస్తాపానికి గురైన కొడుకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడాన్ని జీర్ణించుకోని అతని తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు వారి ఇంటికెళ్లి చూడగా ఇద్దరు విగతజీవులుగా పడిఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు. కాగా, తల్లీకొడుకు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.