Slider ఆంధ్రప్రదేశ్

పొలిటికల్ ఎన్ కౌంటర్ : మీలాగా బజారు భాష మాట్లాడలేను

lokesh 11 12

సొంత కొడుకుని గెలిపించుకోలేక పోయారు అంటున్నారు. నేను చెట్టు పేరు చెప్పుకుని, కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదు. కుప్పం నుంచి నిలబడి ఈజీగా గెలవచ్చు. కాని టిడిపి ఎక్కడ గెలవలేదో, అక్కడ నుంచుని గెలవాలని మంగళగిరి ఎంచుకున్నాను, ఓడిపోయాను.

పులివెందులలా ఈజీగా గెలిచే చోటు కాదు అంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో నన్ను హేళన చేస్తారు, ఇదే మంత్రులు శాసనమండలికి వస్తారు, ఒక్క మాట కూడా నా గురించి ప్రస్తావించరు. లేని చోట ఎందుకు, ఉన్న చోట నా గురించి హేళన చెయ్యండి, సమాధానం చెప్తా.

మా అమ్మ నాన్న, నన్ను ఒక పద్దతిగా పెంచారు, వీళ్ళు మాట్లాడే లాంటి బజారు భాష నేర్పించలేదని లోకేష్ అన్నారు. ఆర్టీసీ బస్ చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఆయన నేడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి నిరసన తెలిపారు.

Related posts

కామెడీ పేరుతో బ్రాహ్మణులపై వెకిలి డైలాగులు

Satyam NEWS

విజయనగరం దిశ పీఎస్ లో ఏపీ మహిళా కమీషన్

Satyam NEWS

కమింగ్ సూన్: హారర్ జోనర్ లో నయనతార వసంతకాలం

Satyam NEWS

Leave a Comment