31.7 C
Hyderabad
June 24, 2024 17: 22 PM
Slider తూర్పుగోదావరి

ఏసీబీ వలలో కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్

#acb

ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ.మురళి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు రూ.2 లక్షలు మురళి డిమాండ్ చేసారు. బాధితుడు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు  రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో  డబ్బులు తీసుకుంటుండగా జీఎంను రెడ్ హ్యాండ్‌గా అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.

Related posts

జలకళ సంతరించుకున్న పోల్కి చెరువుకు పూజలు

Satyam NEWS

ఆర్ధిక పతనం: అధిక వడ్డీ చెల్లిస్తేకానీ పుట్టని అప్పు

Satyam NEWS

విదేశీ వ్యాఖ్యలను మళ్లీ తిప్పికొట్టిన భారత్

Satyam NEWS

Leave a Comment