39.2 C
Hyderabad
April 28, 2024 13: 12 PM
Slider జాతీయం

విదేశీ వ్యాఖ్యలను మళ్లీ తిప్పికొట్టిన భారత్

ravikumar

పౌరసత్వ (సవరణ) చట్టం (CAA), న్యూఢిల్లీలో జరిగిన మత హింస పై అంతర్జాతీయ సంస్థలు, విదేశీ నాయకులు చేసే విమర్శలను భారతదేశం గురువారం మరోసారి తిరస్కరించింది. ఈ విషయాలపై  “బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయవద్దు” అని పునరుద్ఘాటించింది. పౌరసత్వ చట్టంపై US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ మత స్వేచ్ఛ (USCIRF), UN మానవ హక్కుల చీఫ్ మిషెల్ బాచెట్ వంటి వారి నుంచి పదునైన విమర్శలను భారత్ ఎదుర్కొంది.

న్యూఢిల్లీలో జరిగిన మత హింసలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. టర్కీ, ఇరాన్, మలేషియా వంటి దేశాల నాయకులు కూడా ఈ విషయాల పట్ల తమ విమర్శలను గుప్పించారు. “ఢిల్లీలో ఇటీవల హింస జరిగిన సంఘటనలపై చేసిన కొన్ని వ్యాఖ్యలను మనం చూశాం. ఈ దశలో, పరిస్థితి వేగంగా తిరిగి సాధారణ స్థితికి వస్తుందని మేం చెబుతున్నాం “అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. దేశ అంతర్గత విషయాలలో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Related posts

కాంగ్రెస్ ములుగు అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు

Satyam NEWS

ఒడిశాలో చైనా గూఢాచారి పావురాలు

Sub Editor

ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం

Satyam NEWS

Leave a Comment