వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధికి చెందిన పాన్ గల్ మండల కేంద్రంలోని పోల్కి చెరువు సాగునీటి తో కళకళ లాడుతోంది. చాలా కాలం తర్వాత పోల్కి చెరువు నిండడమే కాకుండా పొంగి పొర్లుతున్నది. దాంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనందాన్ని వారు పదిమందితో పంచుకుంటున్నారు. తమను కరుణించిన గంగమ్మను పూజించాలనే తలంపుతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెరువుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల రైతులు, ఆడపడుచులు వచ్చి గంగమ్మ ను పూలతో పూజించారు. పోల్కి చెరువు సాగునీటి కి పూలు చల్లి పూజలు చేసిన అనంతరం చేప పిల్లలను నీటిలో వదిలారు.
previous post