24.7 C
Hyderabad
June 23, 2024 08: 35 AM
Slider విజయనగరం

పోలీసుల ఆయుధాల రిపేర్ వర్క్ షాప్ ప్రారంభించిన ఎస్పీ

#VijayanagaramPolice

విజయనగరం పోలీసుశాఖలో తుపాకులు రిపేరు చేసేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన వర్క్ షాపు ను జిల్లా ఎస్పీ రాజకుమారి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆయుధాలను సక్రమంగా వినియోగించుకోవడం, ఆయుధాల వినియోగం తరువాత ప్రాధమిక స్థాయిలో వాటిని సరి చేసుకోవడం చాలా అవసరమన్నారు.

ఇందుకోసం, ఇంత వరకు ఆర్మర్స్ బయటనే ఆయుధాల రిపేర్లు నిర్వహించే వారని, ఇబ్బందులు పడేవారన్నారు. ఆయుధాలు రిపేరు చేసేందుకు వర్కుషాపు అవసరమని భావించి, అన్ని సౌకర్యాలతో కూడిన వర్క్ షాపును తక్కువ వ్యయం, పోలీసుల శ్రమదానంతో నిర్మించడం జరిగిందన్నారు. ఈ వర్క్ షాపు ఏర్పాటుతో ఆర్మర్స్ కు ఇబ్బందులు తొలగుతాయని, రికార్డులు, ఆయుధాలను శుభ్రం, రిపేర్ చేసేందుకు వినియోగించే పని ముట్లును భద్రపర్చుకొనే అవకాశం ఏర్పడుతుందన్నారు.

తక్కువ సమయం, వ్యయంతో, పోలీసుల శ్రమదానంతో నిర్మించిన ఆర్మర్స్ వర్క్ షాపు ఎంతో సుందరంగా ఉందని, ఇందుకు కారకులైన పోలీసు సిబ్బంది, అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్మర్స్ వర్క్ షాపులో జిల్లా ఎస్పీ రాజకుమారి  ప్రత్యేక పూజలు నిర్వహించి, వర్క్ షాపును ప్రారంభించారు.

అదే విధంగా పోలీసు సిబ్బందికి వాష్ రూంలు లేకుండా ఇబ్బందులు ఉండేవని, వాటిని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించామని జిల్లా ఎస్పీ  రాజకుమారి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఎస్ఈబి అదనపు ఏస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, దిశ డీఎస్పీ టి.త్రినాధ్, సిసిఎస్ డిఎస్పీ జె.పాపారావు, ఎస్బీ సీఐలు ఎన్.శ్రీనివాస రావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, డీసీఆర్ బి  సీఐ బి.వెంకటరావు,వన్ టౌన్  సీఐ జె.మురళి, ఆర్ ఐలు చిరంజీవి, పి. నాగేశ్వరరావు, పి. ఎం. రాజు, టివిఆర్ కే కుమార్, వీ. ఈశ్వరరావు, రమణమూర్తి, పోలీసు అసోసియేషను అధ్యక్షులు కె.శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

[Over|The|Counter] Michael Dempsey Pills For Blood Sugar Remedy

Bhavani

అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులవుతున్న నేతలు

Satyam NEWS

రూ.15 కోట్లతో మల్టీ యుటిలిటీ సెంటర్‌ నిర్మాణానికి అవగాహనా ఒప్పందం

Bhavani

Leave a Comment