24.7 C
Hyderabad
June 23, 2024 08: 47 AM
Slider ప్రత్యేకం

వాలంటీర్లకి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌..

#chandrababu

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు పోతున్నారు. ఇప్పటికే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తాను ముందుగా హామీ ఇచ్చిన ఐదు అంశాలకు లైన్ క్లియర్ చేశారు. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేయగా, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్స్ పై చంద్రబాబు ఐదో సంతకం చేశారు.

బాధ్యతలు చేపట్టగానే తాను ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేయడం పట్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం  చేస్తున్నారు. మరో అత్యంత కీలకమైన హామీని కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో వాలంటీర్లను కొనసాగించే అంశం కూడా ఉంది. వాలంటీర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని, టీడీపీ ప్రభుత్వం వస్తే వారిని తప్పకుండా కొనసాగిస్తామని చంద్రబాబు అప్పుడు హామీ ఇచ్చారు. పైగా వేతనం కూడా పెంచుతామని భరోసా కల్పించారు.

ఇప్పుడు ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వాలంటీర్లు గ్రామాల స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు ఉండి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆసరా పింఛన్లను కూడా ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా పింఛన్లను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ‘‘ఈ పెన్షన్లను అందరికీ డోర్ డెలివరీ చేస్తాం. జులై 1 నుంచి అందరికీ పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారానే ఉండనుంది.

గత ప్రభుత్వం వాలంటీర్లను తమ ఉద్యోగాల నుంచి తప్పుకోమని ఒత్తిడి చేయడం బాధాకరం. మేం వారిని మళ్లీ వారి స్థానాల్లో నియమించి వారి ద్వారా ప్రజలకు సౌలభ్యం కలిగేలా చేస్తాం’’ అని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గత మూడు నెలల నుంచి పెన్షన్లు రానందున అన్ని కలిపి జూలై 1న లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు మొత్తం రూ.7 వేల ఓల్డేజ్ పెన్షన్ అందుతుందని చెప్పారు.

ఈ పెన్షన్ల కోసం గవర్నమెంట్ ఒక్క జూలైలోనే రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. అయితే, అధికారంలోకి వచ్చి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఓల్డేజ్, సామాజిక సాధికార పింఛన్లను అమాంతం రూ.4వేలకు పెంచేయడం  పట్ల ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తం  అవుతోంది.

Related posts

సీఎం జగన్ ఇంటి సమీపంలో పేదల ఇళ్ల కూల్చివేతలు

Satyam NEWS

26న జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి

Satyam NEWS

జెర సోచాయించు తమ్మీ….

Satyam NEWS

Leave a Comment