40.2 C
Hyderabad
May 5, 2024 15: 40 PM
Slider నల్గొండ

26న జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి

#CITU Hujurnagar

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, పెంచిన పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా ఈ నెల 26న నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి తెలిపారు.

జిల్లా, మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేయాలని, సి ఐ టి యు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో జరిగిన సిపిఎం పార్టీ అగ్జలరి శాఖ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రోషపతి మాట్లాడారు.

దేశంలో 200 రోజుల పైగా అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లి నడి బోడ్డున వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తుంటే బిజెపి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా మొద్దు నిద్ర పోతోందని, దేశంలో ప్రజా ప్రభుత్వ ఉందా? లేక పెట్టుబడిదారుల (అంబానీ,ఆదాని) ప్రభుత్వాలు ఉన్నాయా? అన్నట్టుగా ఉందని ఆయన అన్నారు.

4 కార్మిక చట్టాల సవరణ, 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని,నిత్యం పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ ధరలు పెరుగుతున్న తరుణంలో వాటి ప్రభావం నిత్యావసర ధరలపై పడి కార్మికులు, కర్షకులు,ఉద్యోగులు,పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన అందోళనలో ఉన్నారని అన్నారు. 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయ అవకాశవాదంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా ను ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో విఫలం చెందిందని అన్నారు. ఇప్పటికైనా కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని, భారతదేశంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలను అన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యలక సోమయ్య గౌడ్,శీలం వేణు,చెల్లా నాగరాజు,రామకృష్ణ, జయకృష్ణ,వెంకన్న, సైదులు, నరసింహారావు నజీర్,నందిపాటి సైదులు, శివ,నాగేశ్వరావు, యోహన్,శిల్పకళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

డెంగ్యు నివార‌ణ‌పై గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన చర్యలు

Satyam NEWS

అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్డు మరమ్మతుల కోసం ధర్నా

Satyam NEWS

[Free Trial] Diabetes New Medicines Vitamin To Reduce Blood Sugar An Abnormally High Concentration Of Glucose In The Blood

Bhavani

Leave a Comment