24.7 C
Hyderabad
June 23, 2024 08: 10 AM
Slider కృష్ణ

అమరావతిలో టీడీపీ నేత‌ లోకేష్​, భువనేశ్వరి

#naralokesh

గ‌న్న‌వ‌రం ఏర్ పోర్ట్ లో అభిమానుల ఘన స్వాగతం

ఫలితాలు ఎలా ఉంటాయో ఏమో గాని…ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు మాత్రం కాస్త హాడావుడిలో ఉన్నారు. అమరావతిలో టీడీపీ నేత‌ లోకేష్​, భువనేశ్వరి అభిమానుల ఘన స్వాగతం ప‌ల‌క‌డం విశేషం. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ల‌కు గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్​, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. పోలింగ్ ముగిశాక హైదరాబాద్ మీదుగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దాదాపు మూడు వారాలు తరువాత అమరావతి తిరిగి వచ్చారు. నేడు లోకేశ్​​, భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్​ చేరుకున్నారు. అటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ విద్యుత్ కాంతులతో ధగధగలాడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలుగుదేశానికి అనుకూలంగా రావటంతో యువత కేరింతలు కొట్టారు.

Related posts

శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రశ్నే లేదు

Satyam NEWS

ట్రంప్ టూర్:సబర్మతీ ఆశ్రమంలోబాంబ్ స్క్వాడ్ తనిఖీలు

Satyam NEWS

సాయుధ దళంలో పోలీసుల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు

Sub Editor

Leave a Comment