24.7 C
Hyderabad
June 23, 2024 08: 10 AM
Slider ఆధ్యాత్మికం

విజయనగరంలో పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం

#paiditalli

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరా మహోత్సవం ఈ సాయంత్రం దేవస్థానం ఆధ్వర్యంలో దేవరా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా వనంగుడి లో అమ్మవారి కి ఆలయప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకటరావు,ఇఓ.డివివిప్రసాదరావులతో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు స్నపనం, పంచామృతాభిషేకంలోపాల్గొన్నారు.

అనంతరంఆలయంలోఅమ్మవారికిపూజలునిర్వహించిఉత్సవ విగ్రహం తో ముమ్మారు….ఆలయప్రదక్షిణలు అనంతరం ప్రత్యేక రథంపైఉంచి మంగళవాద్యాలతో ఊరేగింపు గా హుకుంపేట చదురుకుచేర్చి‌ మూడు లాంతర్లు దరి చదురుగుడికి చేర్చుతారు.అక్కడ అమ్మవారు ఆరునెలల పాటు భక్తులకు దర్శనం ఇస్తారు.ఈ ఉత్సవంలో ఆలయ వేదపండితులు తాతా రాజేష్ శర్మ, దూసి క్రిష్ణమూర్తి శర్మ, అచ్యుత నాగేంద్ర శర్మ లు, మహిళలు కోలాటాలు, నవదుర్గల ప్రదర్శన బ్రుందాలు, దేవస్థానం సీనియర్ సహాయకులు ఏడు కొండలు, రామారావు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

Related posts

ప్రియ నేస్తం

Satyam NEWS

డ్యూటీ మీట్ లో పతకాలు సాధించినవారికి అభినందన

Satyam NEWS

ధనుర్మాస వ్రతంలో భాగంగా ఘనంగా శ్రీ గోదాదేవి రంగనాథుని కళ్యాణం

Satyam NEWS