32.2 C
Hyderabad
May 8, 2024 11: 15 AM
Slider కవి ప్రపంచం

ప్రియ నేస్తం

#Devalapally Sunanda

అందమైన మబ్బుల గొడుగల్లే

భూమాతకు రక్షణగా నిలిచి ఉంటూ

తెల్లతెల్లాని మబ్బులతో

ఆకాశాన్ని నిర్మలంగాఉంచుతూ

ఎన్నెన్నో చిత్రాలతో చిన్నారులలో

సృజనాత్మకతను పెంచుతూ

నల్లనల్లాని మబ్బులతో రైతన్నల కళ్ళల్లో

కోటి కాంతులు నింపుతూ

రాత్రి వేళల్లో తారకలతో కలిసి నెలరేడు చేసే సయ్యాటలను కళ్లముందుంచుతుంది

పొర్ణమి రోజుల్లో వెన్నెలనంతా మన కోసం వెదజల్లుతుంది

అమావాస్య కటిక చీకట్లో సైతం

తారకల సాయంతో వెలుగు నింపే చిరు ప్రయత్నం చేస్తుంది

జీవితంలో చీకటి వెలుగులు ఎంత సహజమో

కష్ట సుఖాలు అంతేనని తెలుపుతూ

మనకు దూరమైన ఆత్మబంధువులందరినీ ఆకాశంలో కనిపించేలా చేస్తూ

మన బాధలు దూరం చేస్తూ

ఎపుడూ మన తోనే ఉంటూ

మన హితం కోరుతూ

తోడూ నీడగా ఉండేదే ఆ  ఆకాశం

అందుకే ఆకాశమంటే నాకెంతో ఇష్టం

ఆకాశమే కదా మనందరికీ  ప్రియ నేస్తం

దేవలపల్లి సునంద, 9291599562

Related posts

ఐఐటీ జేఈఈ ఫోరం ఇండియా ఎడిషన్ బుక్ లెట్

Satyam NEWS

స్పీడ్ లిమిట్ :మితిమీరిన వేగానికి కళ్లెం ఎస్ పి రాహుల్ హెగ్డే

Satyam NEWS

భ్రూణ హత్యలు రూపుమాపాలి

Satyam NEWS

Leave a Comment