28.7 C
Hyderabad
April 28, 2024 04: 04 AM
Slider కృష్ణ

డ్యూటీ మీట్ లో పతకాలు సాధించినవారికి అభినందన

#police

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ అధికారులను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా అభినందించారు. ఫిబ్రవరి 13 నుండి 17వ తేదీ వరకు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ ను నిర్వహించారు. ఈ డ్యూటీ మీట్ లో పోలీస్ వృత్తి నైపుణ్యాలకు సంబంధించి మొత్తం 11 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దేశంలోని 24 రాష్ట్రాల పోలీస్ విభాగాలు, కేంద్ర పోలీస్ బలగాలు నుండి మొత్తం రెండు వేల మంది పోలీస్ అధికారులు (28 బృందాలుగా) పాల్గొన్నారు.

ఈ పోటీలలో ఎన్.టి.ఆర్ జిల్లా, సిటీ స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ జె.ఆర్.కె.హనీష్ పాల్గొని ఒక స్వర్ణం, ఒక రజత పతకాలను సాధించారు. అలాగే మహిళా ఎస్.ఐ. యు.హైమావతి ఒక రజత పతకాన్ని సాధించారు. ఇన్స్పెక్టర్ జె.ఆర్.కె.హనీష్ 2009 సంవత్సరంలో సివిల్ ఎస్.ఐ.గా నియమితులై  విజయవాడ నగరంలో పలు పోలీస్ స్టేషన్లలలో విధులు నిర్వహించారు. 2012 సంవత్సరంలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొని టీం చాంపియన్ షిప్ ను గెలిచారు.

ప్రస్తుతం సిటీ స్పెషల్ బ్రాంచ్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ సైన్సు వ్రాత పరీక్షా విభాగంలో హనీష్  మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతాకాన్ని  గెలుచుకున్నారు. లిఫ్టింగ్, ప్యాకింగ్ మరియు ఫార్వార్డింగ్ అఫ్ ఎవిడెన్స్ కాంపిటీషన్ విభాగంలో రెండవ స్థానంలో నిలిచి రజత పతాకాన్ని గెలుచుకున్నారు.

మహిళా ఎస్.ఐ. యు.హైమావతి 2018 సంవత్సరంలో విజయవాడ నగరంలో సివిల్ ఎస్.ఐ.గా నియమితులై ప్రస్తుతం సిటీ స్పెషల్ బ్రాంచ్ లో ఎస్.ఐ.గా విధులు నిర్వహిస్తూ మొదటిసారి  66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొన్నారు. క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ టెస్ట్ ఇన్ సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలో హైమావతి రెండవ స్థానంలో నిలిచి రజత పతాకాన్ని గెలుచుకున్నారు.

డి.జి.పి. కె.వి.రాజేంద్రనాద్ రెడ్డి డ్యూటీ మీట్ లో పతకాలు సాధించిన విజేతలలో స్వర్ణం గెలుచుకున్న వారికి మూడు లక్షల నగదు, మూడు ఇంక్రిమెంట్లు మరియు రజత పతకం గెలుచుకున్న వారికి  రెండు లక్షల నగదు రెండు ఇంక్రిమెంట్లు ప్రోత్సాహం ప్రకటించారు. వీరు ఒక స్వర్ణం మరియు రెండు రజత పతకాలు మొత్తం మూడు పతకాలను గెలుచుకుని దేశంలో ఆంధ్రపదేశ్ రాష్ట్రం (ఆరు పతాకాలతో) మూడో స్థానం పొందడానికి కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా హనీష్, హైమావతిలను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా అభినందించారు.

Related posts

పేద పిల్లలకు సాయం చేసేందుకు అనురాగ్ సిద్ధం

Satyam NEWS

గంటలోపే ఆభరణాల దొంగల్ని పట్టుకున్న పోలీసులు

Bhavani

ప్లే స్కూల్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment