24.7 C
Hyderabad
June 23, 2024 08: 59 AM
Slider ముఖ్యంశాలు

సంగారెడ్డిలో కనిపించిన పరారీ వైసీపీ నేత పిన్నెల్లి

#pinnelli

మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, ఈవీఎంలు పగలగొట్టిన నేరంలో నిందితుడు అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డి దగ్గర కనిపించాడు. అయితే పోలీసులకు పట్టుబడినట్లే కనిపించి అంతలోనే సంగారెడ్డి దగ్గర నుంచి మరో కారులో పరారయ్యాడు. సంగారెడ్డి దగ్గర కారు లో మొబైల్ వదిలేసి  పిన్నెల్లి సోదరులు పారిపోయారని అంటున్నారు. మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు అయింది. అదే విధంగా పిన్నెల్లిపై ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 20నే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలంగాణ లోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను ఆడుపులోకి తీసుకున్నారు. ఏ సమయంలో అయినా పిన్నెల్లి బ్రదర్స్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Related posts

పాలనలో విఫలమైన వారు చంద్రబాబుకు పాఠాలు చెబుతారా?

Satyam NEWS

అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్ల అభివృద్ధి

Satyam NEWS

బూర్గుల్ దళిత బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

Satyam NEWS