38.2 C
Hyderabad
April 28, 2024 20: 22 PM
Slider నిజామాబాద్

బూర్గుల్ దళిత బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

#dalitfamily

నిజాంసాగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన బాధిత దళిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు కాదేపురం గంగారాం డిమాండ్ చేశారు. నిజాంసాగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన లస్మగల్ల దస్తయ్య కుటుంబానికి జరిగిన అన్యాయం పై నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు.

అనంతరం తాహసీల్దార్ నారాయణ కి వినతి పత్రాన్ని సమర్పించారు. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి రాజుని కలిసి దళిత కుటుంబానికి జరుగుతున్న అన్యాయం, అదేవిధంగా దీనికి కారణమైన ఆ గ్రామ సర్పంచ్ భర్త ఆఫ్జల్ పై వెంటనే sc, st అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితుల చేత దరఖాస్తు ఇప్పించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ బాధితుల వినతి మేరకు వారి పేరున పట్టా ఉన్న సర్వే నంబర్ 448/3ఆ నందు గల 2-14 గుంటల భూమి ఉన్నదని, అట్టి భూమిని మండల సర్వేయర్ తప్పుడు సర్వే చేసి బాధితులకు అన్యాయం చేశారన్నారు.

అయన సర్వే ప్రకారం బాధితులకు అన్యాయం చేసే విధంగా 1-21 గుంటలు మాత్రమే పొలాన్ని చూయించి, ఇప్పుడు మాత్రం కలెక్టర్ కి నివేదిక పంపామని చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. ఈ విషయంలో పోలీస్ లు సైతం అత్యుత్సాహం చూపుతున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో   mrps జిల్లా అధ్యక్షులు భూమయ్య, dhps డివిజన్ కమిటీ సంయుక్త కార్యదర్శి మీరేవార్ సాయిలు, నాయకులు ఎర్రోళ్ల పోచిరాం, మారుశెట్టి హన్మాండ్లు, ఎర్రోళ్ల అశోక్, రమేష్, కుర్తి వీరేశం, సంగు గోవర్ధన్, నల్లజెరు విఠల్, కడమంచి హన్మాండ్లు, గైని పండరి తదితరులు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జూకల్ నియోజకవర్గం

Related posts

త్యాగంతో వెలుగులు నింపారు.

Sub Editor 2

ఎలక్షన్ గిమ్మిక్: పసుపు హబ్ తో ఏమి ప్రయోజనం?

Satyam NEWS

స్థిరాస్తి వ్యాపారుల కోసమే వరద కాలువ అలైన్మెంట్ మార్పు

Satyam NEWS

Leave a Comment