35.2 C
Hyderabad
April 27, 2024 11: 41 AM
Slider ఆదిలాబాద్

ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి

#seetakka

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలనీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంద్రవెల్లి, కేస్లాపూర్ లలో సిఏం పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్యెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ తో కలిసి ఆమె పరిశీలించారు.

ఈ సందర్బంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఫిబ్రవరి 2 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి, కేస్లాపూర్ పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. నాగోబా దేవాయంలో ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, స్టాల్ సందర్శన, అలాగే దర్బార్ హాల్ లో అధికారులతో నిర్వహించున్న సమావేశం సిఏం పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటు, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టాలని ఆమె ఆదేశించారు. అనంతరం ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద మంత్రి, ఎమ్యెల్యే, అధికారులు నివాళులు అర్పించారు.

అంతకుముందు నాగోబా దర్శనం, హెలి ప్యాడ్, దర్బార్ హాల్, ఇంద్రవెల్లి స్తూపం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, ఎమ్యెల్యే, పిఓ లతో కలిసి మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ గౌస్ అలాం, ఇంచార్జి పిఓ ఖుష్బూ గుప్త, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మోహతో, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఇక లేరు

Satyam NEWS

తెలుగులోనూ మంచి ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌డంతో హ్యాపీ

Satyam NEWS

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న విడుదల

Satyam NEWS

Leave a Comment