26.2 C
Hyderabad
September 9, 2024 16: 26 PM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

#ontimitta

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంగ‌ళ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి,పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 గంట‌ల‌కు అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఏప్రిల్ 17న ధ్వజారోహణం

ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోత‌న జ‌యంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవ నిర్వ‌హిస్తారు. ఈ కార్యక్రమంలో  డెప్యూటీ ఈవోలు నటేష్ బాబు, ప్రశాంతి, సూపరింటెండెంట్‌  హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  న‌వీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

టెంట్‌ కనపడితే చాలు ఉడుముల్లాగా చేరిపోతున్నారు!

Satyam NEWS

ఇంత చైతన్యం ఆనాడు ఉంటే ప్రత్యూషకు న్యాయం జరిగేది

Satyam NEWS

విజయవాడ నుంచే హజ్ యాత్ర చేయండి

Satyam NEWS

Leave a Comment