24.7 C
Hyderabad
June 23, 2024 08: 28 AM
Slider గుంటూరు

పిన్నెల్లి అకృత్యానికి అడ్డుచెప్పని ఉద్యోగుల సస్పెన్షన్

#pinnelli

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పిఓ సహా  ఇతర సిబ్బంది ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మాచర్ల పోలింగ్ స్టేషన్ లో జరిగిన సంఘటనల దృష్ట్యా పోలింగ్ సిబ్బంది పై ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది. ఘటన సమయం లో మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్ధి  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ లో అడుగు పెట్టిన సమయం లో అక్కడ ఉన్న PO మరియు ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేసారు. అంతే కాకుండా వారిని సంఘటన సమయం లో వ్యతిరేకించలేదు. ఈ అభియోగాలపైనే వారిని సస్పెండ్ చేశారు. రేపటి లోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశం జారీ చేశారు. ఈ ఘటన పై పిఓ  సరియైన సమాధానం ఇవ్వలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Related posts

మరీ ఇంత సైలెంటుగా ఉందేమిటి?

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ పేరుతో ఎమ్మెల్యేలు భూములు లాక్కుంటున్నారు

Satyam NEWS

మరణించిన మహానటులకు ఘన నివాళి

Satyam NEWS