39.2 C
Hyderabad
May 3, 2024 13: 42 PM
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ పేరుతో ఎమ్మెల్యేలు భూములు లాక్కుంటున్నారు

#madanmohanrao

కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పేరుతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రైతులకు చెందిన భూములను లాక్కుంటున్నారని ఐటి సెల్ చైర్మన్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో మాస్టర్ ప్లాన్ వల్ల భూములు కోల్పోతున్న అడ్లూరు, అడ్లూర్ ఎల్లారెడ్డి, ఇల్చిపూర్ గ్రామ రైతులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులతో మదన్ మోహన్ రావు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఒక్కొక్క రైతు తనకు జరిగిన అన్యాయాన్ని మదన్ మోహన్ రావుకు వివరించారు. మాస్టర్ ప్లాన్ పై మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఇల్చిపూర్, అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతుల 480 ఎకరాల భూమి మాస్టర్ ప్లాన్ పేరుతో గుంజుకుంటున్నారన్నారు. ఇది ముమ్మాటికీ ఇండస్ట్రియల్ జోన్ కాదని, రియల్ ఎస్టేట్ జోన్ అని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ లో డబ్బులు సంపాదించుకోవడానికి, బడా నాయకుల భూముల రేట్లు పెంచుకోవడానికి సన్నకారు రైతుల భూములు తీసుకుని కమర్షియల్ వ్యాపారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.

దాంతో రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తాత ముత్తాతల నాటి భూములు, వందేళ్ల నాటి భూములు పోయే సమస్యే లేదని, ఇంచు భూమి కూడా పోనివ్వమన్నారు. ఒకవేళ ఇంచు భూమి పోయినా ఆమె శవాలు బయటకు వస్తాయని, వెంటనే మాస్టర్ ప్లాన్ తో భూములు లాక్కునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే సురేందర్ పై ఫైర్

రైతుల భూముల్లో మాస్టర్ ప్లాన్ తో చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, రైతుల కోసం తాను నిరంతరం పాటు పాడుతానని మదన్ మోహన్ రావు అన్నారు. చందాలు వేసుకుని ఎమ్మెల్యే సురేందర్ ను ప్రజలు గెలిపిస్తే ప్రజల పట్ల విశ్వాసంతో ఉండాలే కానీ ప్రజల ద్వారా ఎన్నికై ప్రజల భూములు రైతులను కొల్లగొట్టేందుకే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం .. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్లు లేదన్నారు. లింగంపల్లి జూట్ పరిశ్రమలో 25 కోట్లకు సురేందర్ అమ్మడు పోలేదా అని సురేందర్ పై ధ్వజమెత్తారు.

గ్రామాల్లోని బడాబడా రాజకీయ నాయకులు రైతులకు చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. టిఆర్ఎస్ నాయకులు సీట్ల కోసమే పని చేస్తున్నారని, అందుకనే సీటు రాదని భయపడిన సురేందర్ రైతుల భూములపై మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. ఒక బాధ్యత గలా ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత మరిచి వ్యహరించడం సరికాదన్నారు. మాస్టర్ల ప్లాన్ ను తక్షణమే రద్దు చేసుకోవాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ తరఫున రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

అడ్లూర్ ఎల్లారెడ్డిలో కనీసం వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ రాజు నోటీసులు ఎలా రిటర్న్ పంపారని, దీనిపై డిపిఓ,ఎంపీడీవో, కలెక్టర్లు విచారణ చేయాలన్నారు. ఈ రోజు ఎవరి స్వలాభం కోసం ఎవరు పని చేస్తున్నారని ఊర్లలో ఉన్న రాజాకీయ నాయకులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. గ్రామంలోని బడా రాజకీయ నాయకులకు ముడుపులు అందాయా..? లేదా..? ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

Related posts

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

Satyam NEWS

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్ రెడ్డి

Satyam NEWS

న్యూ ఎజెండా: గ్రామాలలో పరిశుభ్రత తాండవించాలి

Satyam NEWS

Leave a Comment