26.7 C
Hyderabad
May 21, 2024 08: 46 AM
Slider ప్రపంచం

క్యాన్సర్ తో ప్రమాదకర పరిస్థితిలో ఉన్న పుతిన్

#putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై తీవ్రమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక ఇంటెలిజెన్స్ అధిపతి మేజర్ జనరల్ కైరిలో బుడనోవ్ స్కై న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.

పుతిన్ కు క్యాన్సర్, అనేక ఇతర అనారోగ్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆరోగ్య సమస్యలే కాకుండా పుతిన్ ఇప్పుడు తిరుగుబాటు ముప్పును ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. తాను కేవలం రష్యాకు వ్యతిరేకంగా ఉక్రేనియన్ వాదన వినిపించడంలో భాగంగా ఇది చెప్పడం లేదని మేజర్ జనరల్ చెప్పారు.

రష్యాతో యుద్ధం ఆగస్టు లో ముగింపునకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. డాన్బాస్, క్రిమియాతో సహా తాము కోల్పోయిన అన్ని భూభాగాలను తాము పొందుతామని ఆయన అన్నారు. ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం సరిగా లేదనే సమాచారం ఉంది.

క్రెమ్లిన్ కు దగ్గరగా ఉన్న ఒకరి ద్వారా రహస్య సమాచారాని పొందిన తరువాత పుతిన్ కు రక్త క్యాన్సర్ ఉందని న్యూ లైన్స్ మ్యాగజైన్ ఇటీవల పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ స్థితి గురించి మాస్కోలో తీవ్రమైన నిరాశ ఉందని కూడా అందులో పేర్కొన్నారు .పుతిన్ రష్యా ఆర్థిక వ్యవస్థను, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను, అనేక ఇతర ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు అని అందులో పేర్కొన్నారు. రష్యా విక్టరీ డే పరేడ్ సందర్భంగా పుతిన్ కాళ్లపై దుప్పటి కప్పుకుని దగ్గుతూ కనిపించారు.

Related posts

నెల రోజులు నడవకూడదు కాబట్టి ప్రచారానికి రాలేకపోయాను

Satyam NEWS

వాట్సాప్ ద్వారా ఫోరం ఫర్ నీట్ 10 గ్రాండ్ టెస్ట్స్,కీ

Satyam NEWS

శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థులు పోరాడాలి

Bhavani

Leave a Comment