21.7 C
Hyderabad
February 28, 2024 07: 47 AM
Slider ఆదిలాబాద్

మూడో స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ పార్టీ: ఈటల రాజేందర్

#etala

రాజ్యాధికారం అందిపుచ్చుకునే చారిత్రాత్మక సన్నివేశంలో తెలంగాణ బీసీలున్నారు దాన్ని జార విడుచుకోవద్దని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి తరఫున ఆయన నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేను బిఆర్ఎస్ లో ఉంటే ఉన్న బానిసలలో నేను కూడా ఒక బానిసగా ఉండేవాడిని.  కానీ బయటికి వచ్చి నాలుగు కోట్ల ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అని ఈటల రాజేందర్ అన్నారు. పోలీస్ స్టేషన్లను తెరాస కార్యాలయంగా మార్చిన సంస్కృతికి డిసెంబర్ 3 వ తేదీన  అంతం పలకబోతున్నాం. ఓటర్లలో సగభాగం మహిళలే, మన ఆడబిడ్డ సంధ్యను గెలిపించుకుందాం. డబ్బులు లేవు కానీ కాలుకు ముళ్లుగుచ్చుకుంటే పంటితో పీకేంత సేవ చేసే గుణం ఉంది.

ఇన్ని సార్లు మీరు గెలిపించినా మచ్చ తెలీదు. అందుకే మీరు మళ్లీ మళ్లీ గెలిపించారు. 30 ఏళ్లుగా వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధిగా పనిచేసింది. డబ్బులు సంపాదించి దాదా గిరి చేసే వారికి ఆడబిడ్డకు మధ్య పోటీ. సంధ్యారాణికి ఓటు వేస్తే నాకు కూడా ఓటు వేసినట్టు అని ఈటల అన్నారు. రాహుల్ గాంధీ 2% ఓట్లు అని మాట్లాడుతున్నాడు మా ఓట్లు 52% బిడ్డ. మావోట్లు మేము వేసుకుంటే మీకు డిపాజిట్లు కూడా దక్కవు. బీసీ ఎస్సీ ఎస్టిని మైనారిటీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర మీకు ఉందా?  టిఆర్ఎస్ ఉన్నంతకాలం కెసిఆర్ కేటీఆర్ లేదా ఆయన కొడుకు సీఎం అవుతారు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వరు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం మాది అని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు.

మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ. 2013లో ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి మీ ఆశీర్వాదం కావాలి అంటే ప్రధానమంత్రిని చేశారు. ఇదే గడ్డమీద నుంచి అడుగుతున్నాను.. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి బీసీ ని సీఎం చేస్తా అని ఆయన ప్రకటించారు. ఉప ఎన్నికలలో హుజూరాబాద్ గడ్డమీద ఎలాంటి తీర్పు వచ్చిందో తెలంగాణలో కూడా అదే తీర్పు రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ BRS కే పోతారు. మీరు వద్దు అనుకుంటున్న కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అందుకే ఆ పార్టీకి ఓటు వేయద్దు అని ఆయన కోరారు. రాజ్యాధికారం అందిపుచ్చుకునే చారిత్రాత్మక సన్నివేశంలో తెలంగాణ బీసీలున్నారు దాన్ని జార విడుచుకోవద్దని కోరుతున్నాను.

మొదటి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నన్ను అవమానించడం సభలో గల్లా ఎగరేసి తల ఎత్తుకొని లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను.. ఇది రాజుల సొమ్ము కాదు ఇది నా తెలంగాణ ప్రజల రక్త మాంసాలు చెమట బిందువుల మీద కట్టిన పన్నుల డబ్బు.. పేదల కష్టాలకు పరిష్కారం చూపే బాధ్యత ఉంది అని చెప్పిన బిడ్డ రాజేందర్ అని మర్చిపోవద్దు. రాజేందర్ కుల పరంగా మతపరంగా ఎదగలేదు.  ఒక ఉద్యమ బిడ్డుగా ఎదిగిన. కరోనా  సమయంలో ప్రతిఒక్కరూ భయపడ్డారు. అమెరికా బ్రిటన్ ప్రెసిడెంట్ కూడా కన్నీరు పెట్టుకున్నారు.  నా ప్రజలను కాపాడండి దేవుణ్ణి కోరుకున్నారు. ఆ సమయంలో అన్ని ఆసుపత్రులు తిరిగి ధైర్యం మందుని ఇచ్చాను అన్నారు.

Related posts

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం

Satyam NEWS

తాగి ఊగేందుకు మంది వెసులుబాటు: రేట్ కిక్

Satyam NEWS

కాన్ఫిడెన్స్: మునిసిపల్ ఎన్నికలలో మేమే గెలుస్తాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!