24.7 C
Hyderabad
May 19, 2024 02: 12 AM
Slider మహబూబ్ నగర్

పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు: జిల్లా ఎన్నికల అధికారి

#wanaparthy

ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. ఆదివారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ లో సహాయ రిటర్నింగ్ అధికారి ఎం నగేష్ పర్యవేక్షణలో, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సెక్టార్ అధికారులు ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభించారు.

ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ డే కోసం ఈవీఎం లను సిద్దం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నాగేష్, ఎన్నికల అధికారులు, సెక్టార్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రైతు బజార్లలో అసాంఘిక కార్యక్రమాలు

Satyam NEWS

భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి

Sub Editor

హాబిచ్యువల్ మిస్టేక్: విక్టరీ వెంకటేష్ ఓటు ఇప్పుడు కర్నూలులో

Satyam NEWS

Leave a Comment