33.7 C
Hyderabad
April 28, 2024 00: 19 AM
Slider నెల్లూరు

వి ఎస్ యులో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

#simhapuri

కాకుటూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య జి. యం. సుందరవల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు అని అన్నారు. ఆ మహనీయుని వర్ధంతి (జనవరి 30)ని అమరవీరుల దినోత్సవంగా దేశం అంతా నిర్వహిస్తారు అని అన్నారు. సర్వజన హితం నా మతం.. అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు అని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు అదే మార్గంలో విద్యార్థులు అందరూ నడవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. రామచంద్రా రెడ్డి, ప్రిన్సిపాల్, ఆచార్య జి. విజయ్ ఆనంద కుమార్ బాబు, ఆచార్య సుజా నాయర్, డా. యం. హనుమా రెడ్డి, డాక్టర్ ఆర్ మధుమతి మరియు సమన్వయకర్త డాక్టర్ ఉదయ శంకర్ అల్లం పాల్గొన్నారు.

Related posts

శ్రమజీవుల హక్కులను హరిస్తున్న కేంద్రం

Satyam NEWS

ఎల్ వి సుబ్రహ్మణ్యంకు ప్రధాని కార్యాలయం పిలుపు

Satyam NEWS

ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment