ఏలూరు నియోజకవర్గం లో టి డి పి జనసేన పార్టీల మధ్య కొంతకాలం గా ఏర్పడిన అగాధానికి తెరపడింది. అసంతృప్తితో రగిలిపోతున్న రెడ్డప్పలనాయుడు వర్గం టి డి పి బి జె పి జనసేన ఉమ్మడి ఎం ఎల్ ఏ అభ్యర్థి బడేటి రాధా కృష్ణయ్య వర్గం మధ్య మంగళ వారం సయోధ్య కుదిరింది. దీనితో రెండు పార్టీల నాయకులు కార్య కర్తలు ఒక్క తాటి పైకి చేరుకున్నారు.
ఇంకేముంది మా మధ్య ఏవిధమైన రాజకీయ విభేదాలు లేవు ఇరు పార్టీల అధిష్టానాల ఆదేశాల మేరకు కలిసి పని చేసి ఏలూరులో టి డి పి విజయ బావుటా ఎగరవేస్తామని జనసేన నాయకుడు రెడ్డప్పలనాయుడు టి డి పి ఉమ్మడి ఎం ఎల్ ఏ అభ్యర్థి బడేటి చంటి ఒకే వేదిక పై కలిసి ప్రకటించారు. నగరం లో నెల రోజులుగా రెండు పార్టీల మధ్య ఏర్పడిన ఉత్కంఠత ఉత్తిదే అని మంగళవారం జిల్లా జనసేన పార్టీ కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశం లో తేల్చేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకుడు రెడ్డప్పలనాయుడు, టి డి పి ఏలూరు ఎం ఎల్ ఏ అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనసాగిన వై సి పి రాక్షస పాలన అంతమొందించి ఏలూరులో ఎన్ డి ఏ కూటమి బలపరిచి టి డి పి ఎం ఎల్ ఏ అభ్యర్థి బడేటి చంటి విజయానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు.