కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలో దారుణ హత్య జరిగింది. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొమరం భీం జిల్లా తిర్యాని మండలం మాణిక్య పూర్ గ్రామపంచాయతీలో గల రాజు గూడ కు చెందిన అత్రం తిరుపతి నిన్న రాత్రి తన పంటచేనులకు కావలికి వెళ్లాడు. ఉదయం ఎంత సమయం అయినా ఇంటికి రాకపోవడంతో తన కుమారుడు వెళ్లి చూసే సరికి హత్యకు గురై ఉన్నాడు. తిరుపతి హత్య విషయం వెల్లడి కావడంతో నిందితుల కోసం డాగ్ స్క్వాడ్ తో పరిసరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
previous post