24.7 C
Hyderabad
March 26, 2025 09: 42 AM
Slider విశాఖపట్నం

అనంత లోకాలకు మార్గాలు… అనకాపల్లి రహదారులు!

#naralokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యంగాస్త్రాలు…!

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి… తన పర్యటనలో కనిపిస్తున్న అభివృధ్ధిపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా అనకాపల్లి-పాడేరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన అనకాపల్లిలో అకస్మాత్తుగా తన వెహికల్ ను ఆపి… “ఇది అనకాపల్లిలోని ప్రధాన రహదారి. జగన్ రెడ్డి జమానాలో గోతుల్లో రోడ్డు ఎక్కడుందా అని వెదుక్కోవాల్సి వస్తోంది. ఈ రోడ్లపై ప్రయాణిస్తే గర్బిణీలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. చేతగాని ముఖ్యమంత్రి సిగ్గు,లజ్జా లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నానని డబ్బాలు కొట్టుకుంటున్నాడు. కాంట్రాక్టర్లకు 1.80లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో టెండర్లు పిలచినా ఈ సిఎం మొఖం చూసి రోడ్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసిన మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేయించాను. భస్మాసురుడు జగన్ పాలనలో 4.10 ఏళ్లుగా రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు…”అని అన్నారు. మరో 2నెలల్లో రాబోయే టిడిపి-జనసేన ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రోడ్లన్నింటినీ బాగుచేసేందుకు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Related posts

విజయనగర,పైడితల్లి ఉత్సవాల బందోబస్తు పై ఎస్పీ దృష్టి

Satyam NEWS

ప్రయివేటు వ్యక్తులతో టెలిఫోన్ ట్యాపింగ్?

mamatha

దివ్యాంగ బాలబాలికలకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరం

Satyam NEWS

Leave a Comment