35.2 C
Hyderabad
May 9, 2024 17: 40 PM
Slider నెల్లూరు

వి ఎస్ యులో ఘనంగా ఎడెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

ఈడేక్స్ కోర్సుల ప్రారంభ కార్యక్రమం వి ఎస్ యులో ఘనంగా జరిగింది. తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టరేట్ నందు ఆన్లైన్లో జరిగిన లాంచన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.రామచంద్ర రెడ్డి, డీన్ సి డి సి ఆచార్య సిహెచ్. విజయ,ఎడెక్స్ కోఆర్డినేటర్ డాక్టర్. ఉస్సేనయ్య, డాక్టర్ ఉదయ శంకర్ అల్లం, డీ.జోష్న పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఎడెక్స్ లో సుమారు 1800 కోర్సులు ఉచితంగా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యార్థులందరూ ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ కోర్సులలో రిజిస్టర్ చేసుకొని లబ్ధి పొందాలని కోరారు. ఈ కోర్సులు అంతర్జాతీయంగా పేరెన్నిక గల స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ ఎం ఐ టి వంటి విద్యాలయంలో ఉన్న అధ్యాపకులచే డిజైన్ చేయబడినవని తెలిపారు. అదేవిధంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ లలో ఎడెక్స్ ప్రారంభోత్సవాన్ని విద్యార్థులు మరియు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి విజయ ఆనందకుమార్ బాబు యూట్యూబ్ లింకు ద్వారా వీక్షించారు.

Related posts

ఉత్తర కర్ణాటకలో భారీ వర్షంతో కల్లోలం

Satyam NEWS

Analysis: ఆగుతున్న శ్వాసను నిలబెట్టే ఆశ

Satyam NEWS

‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదల

Satyam NEWS

Leave a Comment