32.2 C
Hyderabad
May 2, 2024 00: 53 AM
Slider ఖమ్మం

చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

#checkpost

చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా వుంటూ, పటిష్ట నిఘా చర్యలు చేపట్టి  విస్తృత తణిఖీలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. కూసుమంచి మండలం, నాయకన్ గూడెం లో ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, స్టాటిటిక్ సర్వీలెన్స్ టీమ్ చెక్‌పోస్టును  ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది, ఏ ఏ రకాల వాహనాలు తనిఖీ చేసింది నమోదు రిజిస్టర్ పరిశీలించారు. ప్రభుత్వ, పోలీస్ వాహనాలు, రాజకీయ పార్టీల, పోటీ అభ్యర్థుల వాహనాలు, అంబులెన్స్ లు తప్పనిసరిగా వందశాతం ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. నగదు, మద్యం రవాణా నియంత్రించాలన్నారు. చెక్‌ పోస్ట్‌ లో వాహన తనిఖీలు వీడియోగ్రఫీ చేయాలన్నారు.  అప్రమత్తంగా వుంటూ, 24 గంటల పటిష్ట నిఘా పెట్టాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఎంపిడిఓ రమాదేవి, సిఐ జితేందర్ రెడ్డి, అధికారులు తదితరులు  ఉన్నారు.

Related posts

గుడ్ ఎఫెక్ట్: ఫలితాలను ఇస్తున్న కార్డన్ అండ్ సెర్చి

Satyam NEWS

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాయచోటిలో మానవహారం

Satyam NEWS

రోడ్డు ప్రమాదం లో తండ్రి,కొడుకు మృతి

Murali Krishna

Leave a Comment