29.7 C
Hyderabad
May 2, 2024 04: 25 AM
Slider సంపాదకీయం

ఓటమి అంచున ఊగుతున్న వైసీపీ బడానేతల వారసులు

#jagan

వైస్ఆర్ సీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కొంత మంది ఈ ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ వద్దన్నా కూడా తమ వారిని దగ్గరుండి గెలిపించుకుంటామని భరోసా కల్పించి మరీ టికెట్లు కుమారులకు లేదా కుమార్తెలకు కేటాయించుకున్నారు. వీరిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టూ, రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాలకు ఈ ఎన్నికల కోసం జగన్ టికెట్లు కేటాయించారు.

వీరంతా వయోభారం కారణంగానో లేక తాము బాగున్నప్పుడే తమ వారసులకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే టికెట్లు ఇప్పించుకున్నారు. కానీ, వీరందరి పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్క గుంటూరు, మచిలీపట్నంలోనే వైసీపీ అభ్యర్థులపై ఆశలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మిగతా అన్ని చోట్లా వైసీపీ ఓడిపోవడం ఖాయంగా  చెబుతున్నారు. దీంతో తాము ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో వారసుల తండ్రులు ఉన్నట్లు తెలుస్తోంది.

తిరుపతిలో భూమన అభినయ రెడ్డి జనసేన అభ్యర్థి జనసేన ఆరని శ్రీనివాసులుతో పోటీలో ఉన్నారు. చంద్రగిరిలో మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో తలపడుతున్నారు. గుంటూరులో నూరీ ఫాతిమా టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్ తో పోటీ పడుతున్నారు. రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ టీడీపీ అభ్యర్థి వాసంశెట్టిని ఎదుర్కోనున్నారు. బందరులో పేర్ని కిట్టూకు కూడా గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. జగన్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత ఈ యువ నేతల గెలుపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.

తిరుపతిలో జనసేన, చంద్రగిరి, రామచంద్రాపురంలో టీడీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న కాపులు, బలిజలు అత్యధిక శాతం ఉన్నారు. తిరుపతిలోనే వీరు 40 శాతం ఉండగా.. అంతా జనసేన వైపు ఉన్నారు. అందుకే భూమన అభినయ రెడ్డికి గడ్డు కాలమని అంటున్నారు. ఆరణి శ్రీనివాసులు గతంలో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే కాగా.. జనసేనలో చేరి తిరుపతి టికెట్ తెచ్చుకున్నారు. చంద్రగిరిలోనూ పులివర్తి నానికి కాపు, బలిజ ఓటర్ల మద్దతు బాగా ఉండడంతో ఆయన గెలుపు సులువు అంటున్నారు. గుంటూరు, బందరులో పోటీ తీవ్రంగా ఉందని.. టీడీపీ అభ్యర్థులవైపే కాస్త ఎక్కువ పవనాలు వీస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు.

Related posts

కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలి

Satyam NEWS

ఈనెల 29న మంత్రి కెటిఆర్ పర్యటన విజయవంతం చేయాలి

Satyam NEWS

అలా మొదలైంది లఘు చిత్రం విజయోత్సవం

Satyam NEWS

Leave a Comment