34.2 C
Hyderabad
May 14, 2024 22: 34 PM
Slider మహబూబ్ నగర్

ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలి: సిపిఎం

#cpmprotest

ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధం పర్వతాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గిరిజన కుటుంబానికి ఇతర బీసీ లకు ఫారెస్ట్ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

ఆ భూములలో ఫారెస్ట్ అధికారుల వేధింపులు లేకుండా పంటలు సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అలాగే భూముల్లో బోర్లు వేసుకుని సాగు చేసుకోవడానికి అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ముక్కిడి గుండం మల్ల చింతలపల్లి సరిహద్దుల్లో ఉన్న జిల్దార్ తిప్ప చెరువుకు సాగునీరు అందించారని, పక్కనే కే ఎల్ ఐ ప్రాజెక్టు ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇతర జిల్లాలకి సాగునీరు అందిస్తున్నారు కానీ ఈ గ్రామానికి అందించకపోవడం శోచనీయమన్నారు.

అలాగే ఇప్పుడు ముక్కిడి గుండం గ్రామానికి ఇరువైపులా ఉన్న బ్రిడ్జిల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, తక్షణమే నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఈశ్వర్, సిపిఎం మండల కార్యదర్శి  శివవర్మ, రైతు సంఘం మండల కార్యదర్శి బి బాలపిర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తార సింగ్, చంద్రు నాయక్ ,బాలు నాయక్, సేవ్య నాయక్, శ్రీను నాయక్ , నిరంజన్ ,మత్తయ్య, ఆంబోతు శివ, బాలకృష్ణయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఆదుకున్న ఎన్టీఆర్ యువత

Satyam NEWS

ఘనంగా యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు రవి రాఘవేంద్ర జన్మదినం

Satyam NEWS

అమ్మనాన్న వృద్దాశ్రమంలో దుస్తులు, పండ్లు ఇచ్చిన విద్యార్థులు

Satyam NEWS

Leave a Comment